DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్, ఏప్రిల్ నెల జీతంతో డీఏ ఎరియర్ల చెల్లింపు

DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల డీఏను 2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎరియర్లతో సహా డీఏ అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2025, 07:44 PM IST
DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్, ఏప్రిల్ నెల జీతంతో డీఏ ఎరియర్ల చెల్లింపు

DA Hike Updates: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి నెల డీఏ పెంపు ప్రకటన వాస్తవానికి హోలీ నాటికి రావల్సి ఉన్నా ఈసారి ఆలస్యమైంది. దీనికితోడు ఈసారి ఏడేళ్ల కనిష్ట డీఏ అందనుంది. జనవరి నెల డీఏను కేంద్ర ప్రభుత్వం 2 శాతంగా నిర్ణయించింది. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ప్రతి ఏటా రెండు సార్లు పెరుగుతుంటుంది. ఏడాదిలో మొదటిసారి జనవరిలోనూ రెండవసారి జూలైలోనూ పెరుగుతుంటుంది. సాధారణంగా జనవరి డీఏ పెంపు ప్రకటన మార్చ్ నెలలోనూ, జూలై నెల డీఏ పెంపు ప్రకటన అక్టోబర్ నెలలోనూ ఉంటుంది. అయితే ఎరియర్లతో సహా చెల్లిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డీఏ పెంపు నిర్ణయిస్తే..జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జూలై డీఏ ఎంతనేది నిర్ణయిస్తుంటారు. 

గత ఏడాది జూలైలో డీఏ 3 శాతం చేయడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి డీఏ మరో 3 శాతం ఉంటుందని భావించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఈసారి డీఏ కేవలం 2 శాతంగా నిర్ణయించడంతో మొత్తం డీఏ 55 శాతానికి చేరుకుంది. ఇటీవల ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల ఎరియర్లతో పాటు ఏప్రిల్ నెల జీతంతో ఈ పెరిగిన డీఏను చెల్లిస్తారు. దాంతో ఏప్రిల్ నెలలో భారీగా జీతం అందుకోనున్నారు. పెరిగిన డీఏ ప్రకారం కనీస వేతనం 18 వేలు ఉన్న ఉద్యోగులకు నెలకు అదనంగా 360 రూపాయలు అందుతాయి. మూడు నెలల ఎరియర్లు కలిపి 1080 రూపాయలు అందుతాయి. కనీస వేతనం 9 వేలు ఉన్న ఉద్యోగులకు 180 రూపాయలు ఎరియర్లతో కలిపి 540 రూపాయలు అందుతాయి. 

డీఏ పెంపుతో దేశవ్యాప్తంగా 48.6 లక్షల మంది ఉద్యోగులకు, 66.5 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వంపై మాత్రం ఏడాదికి 6,614 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం నిరీక్షిస్తున్నారు. 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే మొత్తం అప్పటి వరకు ఉండే 57 లేదా 58 శాతం డీఏ కనీస వేతనంలో కలిపి జీరో నుంచి లెక్కిస్తారు. అటు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మారడంతో కనీస వేతనం భారీగా పెరగనుంది. అందుకే ఉద్యోగులు చాలా అశతో ఎదురు చూస్తున్నారు. 

Also read: Amaravati Works: అమరావతిలో సీన్ రిపీట్, సింగపూర్ రీ ఎంట్రీ, ప్రధాని మోదీతో రీ లాంచ్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News