7th Pay Commission: డీఏ పెంపుతో ఉద్యోగుల జీతం, గ్రాట్యుటీ, పీఎఫ్ ఎంత పెరుగుతాయో తెలుసా

7th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉద్యోగుల డీఏ పెంచింది. డీఏ పెరగడంతో ఏప్రిల్ నెల జీతం ఎంత పెరుగుతుంది, జీపీఎఫ్, గ్రాట్యుటీలు ఎంత వస్తాయనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 14, 2025, 08:29 PM IST
7th Pay Commission: డీఏ పెంపుతో ఉద్యోగుల జీతం, గ్రాట్యుటీ, పీఎఫ్ ఎంత పెరుగుతాయో తెలుసా

7th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి డీఏ పెంపును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఈసారి డీఏ కేవలం 2 శాతమే పెరిగింది. దాంతో మొత్తం డీఏ 53 నుంచి 55 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్ నెల జీతం ఉద్యోగులు భారీగా అందుకోనున్నారు. ఆ వివరాలు మీ కోసం.

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల డీఏ పెంపు ప్రకటన ఇటీవలే వెలువడింది. డీఏ 2 శాతం పెంచింది. దాంతో మొత్తం డీఏ 53 నుంచి 55 శాతానికి చేరుకుంది. మొత్తం నాలుగు నెలల డీఏ ఒకేసారి అందనుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల పెరిగిన డీఏ ఏప్రిల్ నెల జీతంతో అందనుంది. అంటే మూడు నెలల ఎరియర్లు, ఏప్రిల్ నెల డీఏ కలిపి ఒకేసారి వస్తాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరిగిన డీఏతో 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. అదే  సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ 2 శాతం అందనుంది. 

ప్రతి ఉద్యోగి కనీస వేతనం ఆధారంగా డీఏ ఉంటుంది. డీఏ పెరిగితే ఉద్యోగి గ్రాస్ శాలరీ పెరుగుతుంది. అంటే ఓ ఉద్యోగి కనీస వేతనం 30 వేలు ఉంటే 53 శాతం డీఏతో 15,900 రూపాయలు అవుతుంది. డీఏ ఇప్పుడు 55 శాతానికి చేరుకోవడంతో మొత్తం డీఏ 16,500 రూపాయలు ఉంటుంది. అంటే నెలకు 600 రూపాయలు జీతం పెరుగుతుంది. 

ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ కూడా కనీస వేతనం ఆధారంగా నిర్ణయిస్తారు. ఉద్యోగి చివరిసారిగా తీసుకున్న కనీస వేతనం 50 వేలు అనుకుంటే డీఏ 55 శాతంగా ఉన్నప్పుడు గ్రాట్యూటీ మొత్తం 77,500 రూపాయలు ఉంటుంది. అదే డీఏ 53 శాతం ఉంటే గ్రాట్యుటీ నగదు 76,500 రూపాయలు ఉంటుంది. ఇక జనరల్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే జీపీఎఫ్ అనేది కనీస వేతనానికి డీఏ కలిపితే వచ్చే మొత్తంపై 6 శాతం ఉంటుంది. అంటే కనీస వేతనం 30 వేలు ఉంటే డీఏ 16,500 రూపాయలు కలుపుకుంటే 4,50 రూపాయలు అవుతుంది. ఇందులో 6 శాతం అంటే 2,790 రూపాయలు జీపీఎఫ్ ఉంటుంది.

ఈ లెక్కన డీఏ పెరగడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మూడు నెలల ఎరియర్లు ఏప్రిల్ నెల జీతంతో అందుకుంటారు కాబట్టి భారీగా జీతం అందుకోనున్నారు. 

Also read: Amaravati Capital Works: అమరావతిలో మళ్లీ భూ సమీకరణ, మరో 44 వేల ఎకరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News