)
Govt Employees Holidays: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సెప్టెంబర్ నెలలో ఉద్యోగులకు భారీ ఎత్తున సెలవులు వస్తున్నాయి. గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ పరిశీలిస్తే ఉద్యోగులకు సంబంధించిన సెలవులు ఎన్ని వచ్చాయో పరిశీలిస్తే మొత్తం 8 లభిస్తున్నాయి. ప్రత్యేకమైన పండుగలతోపాటు వారాంత సెలవులు కలిపితే మొత్తం 8 రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఆ సెలవులు పెరగనున్నాయి.
ఈ నెలలో మొత్తం 30 రోజులు ఉండగా.. పని దినాలు 22 రోజులు వచ్చాయి. సెలవులు 8 రోజులు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే ఒక సెలవు రానుంది. అది మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులతోపాటు పాఠశాలలు, విద్యాలయాలకు సెలవు ఉండనుంది. ఒక రోజు విడిచిన తర్వాత ఏడో తేదీన ఆదివారం వచ్చింది. ఒక్క శనివారం సెలవు పెడితే మొత్తం మూడు రోజులు కలిసి రానున్నాయి. రెండో వారంలో రెండో శనివారం యథావిధిగా సెలవు వచ్చింది. రెండు రోజులు సెలవులు ఎంజాయ్ చేయవచ్చు.
మూడు, నాలుగో వారాల్లో ఒక్క ఆదివారం తప్ప ఒక్క సెలవు రాలేదు. బ్యాంకు ఉద్యోగులకు 27వ తేదీన నాలుగో శనివారం సెలవు లభించింది. ఒక రోజు తర్వాత దుర్గాష్టమి రావడంతో ఆ రోజు సెలవు ఉంది. 21వ తేదీన మహాలయ అమావాస్య రావడంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు సెలవు ఉండే అవకాశం ఉంది. అయితే ఆప్షనల్ హలీడేగా ఇవ్వనున్నారు.
తేదీ సెలవు
5వ మిలాద్ ఉన్ నబీ
7 ఆదివారం
13 రెండో శనివారం
14 ఆదివారం
21 ఆదివారం
27 నాలుగో శనివారం
28 ఆదివారం
30 దుర్గాష్టమి
ఆప్షనల్ హలీడే
21 మహాలయ అమావాస్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.