8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు పెద్దమొత్తంలో పెరగనున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరుగుతాయనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా నిర్ణయమౌతుంది.
కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల జీతం అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంటుంది. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు డిమాండ్ చేసినట్టే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే ఉద్యోగుల కనీస వేతనం 51,480 రూపాయలు చేరుతుంది. అటు పెన్షన్ ఏకంగా 25,740 రూపాయలు అవుతుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంపుదలకు లెక్కిస్తారు. ఉద్యోగుల కనీస వేతనం ప్రస్తుతం జీతాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారా లెక్కిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. 6వే వేతన సంఘం సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 కాగా జీతాలు రికార్డు స్థాయిలో 54 శాతం పెరిగాయి. ఇక 7వ వేతన సంఘం సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే జీతం భారీగా పెరగనుంది. కనీస వేతనం ఏకంగా 54 వేలకు చేరుకోవచ్చు.
Also read: Vandebharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు, ఎప్పుడు ఏ మార్గంలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి