8th Pay Commission: ఉద్యోగులు పెన్షనర్లకు బిగ్ న్యూస్, మూడేళ్లు ముందుగానే భారీగా డబ్బులు

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్. 8వ వేతన సంఘం ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేపుతోంది. కొన్ని కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మూడేళ్ల ముందుగానే భారీగా డబ్బులు చేతికి అందుతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2025, 02:49 PM IST
8th Pay Commission: ఉద్యోగులు పెన్షనర్లకు బిగ్ న్యూస్, మూడేళ్లు ముందుగానే భారీగా డబ్బులు

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత ఉద్యోగుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరుగుతుంది. అదే సమయంలో కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్‌ను తగ్గించే ప్రతిపాదన అమలు కావచ్చు. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన గమనిక. 8వ వేతన సంఘంతో పాటు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన డిమాండ్‌పై చర్చ జరుగుతోంది. కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్‌ను 15 నుంచి 12 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదన ఉంది. ఇది అమల్లోకి వస్తే పెన్షనర్లకు భారీ ప్రయోజనం కలగనుంది. లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. 2026 జనవరి 1 నుంచి ఈ కమీషన్ అమల్లోకి రావల్సి ఉంది. ఎందుకంటే ఎవరైనా ఓ ఉద్యోగి రిటైర్ అయితే ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది. ఇందులో 40 శాతం ఒకేసారి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే కమ్యూటెడ్ పెన్షన్ స్కీమ్. అయితే కనీసం 15 ఏళ్లు ఉండాలి. కానీ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే 12 ఏళ్లకు తగ్గుతుంది. దాంతో చాలామందికి ప్రయోజనం కలగనుంది.

దేశంలో కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలు గతంలోనే ఈ సిఫారసు అమలు చేశాయి. వాస్తవానికి 5వ వేతన సంఘంలోనే 12 సంవత్సరాలకు తగ్గించాలనే సిఫారసు ఉంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మూడేళ్లు ముందుగానే అంటే 12 ఏళ్లకు పూర్తి పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో ఆర్ధికంగా సెక్యూరిటీ లభిస్తుంది. ఈ మార్పు ద్వారా దేశవ్యాప్తంగా ఏకంగా 65 లక్షల మంది పెన్షనర్లకు లాభం కలుగుతుంది. 

ఈ ఏడాది మార్చ్ 11వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్ధిక శాఖ ఈ అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో చేర్చాలని సూచించింది. అటు ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఈ డిమాండ్ గట్టిగా విన్పిస్తోంది. ఈ డిమాండ్ ఆమోదించకుంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈసారి అంటే 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.5 నుంచి 2.86 మధ్యలో ఉండవచ్చని ఓ అంచనా ఉంది. అదే జరిగితే పెన్షన్ 20-30 శాతం పెరుగుతుంది. 

Also read: Cyclone Alert: అరేబియా సముద్రంలో తుపాను, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News