8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపుకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ ఇది. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదే జరిగితే ఉద్యోగులకు ఇక జాక్‌పాట్ తగిలినట్టే.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్ తగిలినట్టే. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు ఏకంగా 157 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలకమైన ప్రక్రియగా భావిస్తున్న నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉద్యోగుల జీతభత్యాల పెంపులో కీలకంగా మారే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 లేదా అంతకంటే ఎక్కువ నిర్ణయించాలని డిమాండ్ చేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఈ డిమాండ్‌ను ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్ తగిలినట్టే భావించాలి. ఉద్యోగుల జీతాలు ఏకంగా 157 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం 18 వేలు ఉన్న కనీస వేతనం కాస్తా 46,260 రూపాయలకు పెరగనుంది. అదే విధంగా కనీస పెన్షన్ 9 వేల నుంచి 23,130 రూపాయలకు పెరుగుతుంది. 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతానికి ఆమోదించడంతో ఉద్యోగుల కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది అంత సులభం కాదని తెలుస్తోంది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 కు ప్రభుత్వం అంగీకరించవచ్చని మాజీ ఆర్ధిక శాఖ కార్యదర్శి సుభాష్ గార్గ్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92కు ఓకే చెబితే ఉద్యోగుల కనీస వేతనం 18 వేల నుంచి 34,560 రూపాయలు అంటే 92 శాతం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేటు, ఉన్నత చదువులకు అయ్యే ఖర్చు, ఆరోగ్యం, డిజిటల్ సేవల ఖర్చు భారీగా పెరగడంతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉండాల్సిందేననేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వాదన.
7వ వేతన సంఘం ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ 31తో పూర్తి కానుంది. కొత్తగా ఏర్పడుతున్న 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. కానీ కొద్దిగా ఆలస్యం కావచ్చనే అంచనా ఉంది. కొద్ది రోజుల వ్యవధి తేడాతో అమల్లోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడం ఖాయం. అందుకే ఉద్యోగులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియాదేనా, ఇదే రీజన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









