8th Pay Commission: ఉద్యోగులకు షాక్, కొత్త వేతన సంఘం మరింత ఆలస్యం ఎప్పుడంటే

8th Pay Commission: 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. అయితే ఉద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురయ్యేట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2025, 11:00 AM IST
8th Pay Commission: ఉద్యోగులకు షాక్, కొత్త వేతన సంఘం మరింత ఆలస్యం ఎప్పుడంటే

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా అంచనాలు మొదలయ్యాయి. జీతభత్యాలు భారీగా పెరగనుండటంతో ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్నారు. వాస్తవానికి 2026 జనవరి నుంచి అమలు కావల్సి ఉంది కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కన్పిస్తోంది. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం అమలు ప్రక్రియ చాలా ఆలస్యమయ్యేట్టు కన్పిస్తోంది. 2026 జనవరిలో కాకుండా దాదాపుగా మరో ఏడాది ఆలస్యం కావచ్చని అంచనా ఉంది. కొత్త వేతన స్కేల్, పెన్షన్ పెంపు అన్నీ 2027లోనే అమల్లోకి రావచ్చని తెలుస్తోంది. అంటే కొత్త పే కమీషన్ సిఫార్సులు ఖరారు చేసేందుకు, అమలు చేసేందుకు మరో ఏడాదిన్నర సమయం ఈజీగా పట్టవచ్చు. వాస్తవానికి 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం జనవరి 16నే అధికారికంగా ప్రకటించింది. కానీ కమీషన్ ఏర్పాటు ఇంకా కాలేదు. వచ్చే నెలలో కొత్త కమీషన్ పనులు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. 

అంతకంటే ముందు నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ సూచనలు కోరింది. ఈ క్రమంలో ఉద్యోగుల డిమాండ్లను ఎంతవరకు పరిగణలో తీసుకుంటారనేది కీలకం కానుంది. అయితే కొత్త వేతన సంఘం అమల్లోకి రావడంలో ఆలస్యమైనా పెరిగిన జీతం, పెన్షన్ మొత్తం ఎరియర్లతో కలిపి వస్తుంది. అంటే 2027లో అమలైనా సరే 2026 జనవరి నుంచి లెక్కగట్టి చెల్లిస్తారు. ఈ లెక్కన కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఒకేసారి భారీగా డబ్బులు అందనున్నాయి. ఇదే అంశంపై పార్లమెంట్‌లో ప్రస్తావనకొచ్చింది. కమీషన్ నోటిఫికేషన్, ఛైర్ పర్సన్, సభ్యుల నియామకం విషయంలో సమయం పడుతుందని వెల్లడైంది. 

అందుకే 8వ వేతన సంఘం అమల్లో వచ్చేందుకు మరింత ఆలస్యం జరగవచ్చని సమాచారం. డియర్‌నెస్ అలవెన్స్, పదోన్నతి విధానంలో పారదర్శకత, గ్రాట్యుటీ పెంపు వంటి అంశాలపై క్లారిటీ రావల్సి ఉంది.

Also read: 8th Pay Commission: వేతన సంఘంలో పింఛన్‌దారులకు భారీ కోత.. పింఛన్‌ సవరణకు బ్రేక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News