8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, లెవెల్ 9,10 కేటగరీ ఉద్యోగులకు పెరిగే జీతం ఇదే

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. 8వ వేతన సంఘంతో జీతాలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా దేశంలోని లెవెల్ 9, 10 ఉద్యోగులకు ఊహించనంత జీతం పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2025, 01:07 AM IST
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రేట్‌న్యూస్, లెవెల్ 9,10 కేటగరీ ఉద్యోగులకు పెరిగే జీతం ఇదే

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రకటించినప్పటి నుంచి జీతభత్యాలు ఏ మేరకు పెరగనున్నాయనే అంశంపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఏయే కేటగరీ ఉద్యోగులు ఎంతెంత జీతం పెరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. మరో వైపు 8వ వేతన సంఘం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Add Zee News as a Preferred Source

8వ వేతన సంఘం చైర్మన్ ఎవరు, సభ్యులు ఎంతమంది ఉంటారు. ఎవరెవరు ఉంటారనే వివరాలు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించనుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే కనీస వేతనాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్తో గుణించగా వచ్చేదే జీతం పెంపు ఉంటుంది. ఈసారి 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా. కనీస వేతనం 18 వేలు ఉన్నవారికి జీతం భారీగా పెరగనుంది. ఈ కేటగరీ ఉద్యోగులకు కనీస వేతనం 51 వేలు కానుంది. 

ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో లెవెల్ 9, 10 ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఈ కేటగరీలో డీఎస్పీ, ఎక్కౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వీరి కనీస వేతనం ప్రస్తుతం 53,100 రూపాయలు ఉంది. 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతం ఉంటే కనీస వేతనం ఒక్కసారిగా 1,50,000 కానుంది. ఇక లెవెల్ 10 కేటగరీలో వచ్చే సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు ప్రస్తుతం కనీస వేతనం 56,100 రూపాయలు కాగా 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే 1.6 లక్షలు కానుంది.

Also read: IT Returns: ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ సులభమైన ప్రక్రియ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News