8th Pay Commission Major Update: కళ్లు చెదిరే జీతం, 46-51 వేలకు చేరనున్న కనీస వేతనం, భారీగా పెన్షన్

8th Pay Commission Major Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పుడు 8వ వేతన సంఘం గురించే చర్చ నడుస్తోంది. ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరుగుతాయో ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2025, 03:31 PM IST
8th Pay Commission Major Update: కళ్లు చెదిరే జీతం, 46-51 వేలకు చేరనున్న కనీస వేతనం, భారీగా పెన్షన్

8th Pay Commission Major Update: 8వ వేతన సంఘం ఏర్పాటులో భాగంగా కీలకమైన ప్రక్రియ కొనసాగుతోంది. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు ఉంచింది. వీటికి ఆమోదం లభిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బారీగా పెరగనున్నాయి. జీతం ఏకంగా 157 శాతం పెరగవచ్చు. 

Add Zee News as a Preferred Source

8వ వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్ పాట్ తగలనుంది. కొత్త వేతన సంఘంలో కీలకమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై చర్చ జరిగింది. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచింది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉండాలని ఉద్యోగుల సమాఖ్య కోరుతోంది. ఉద్యోగుల జీతం, పెన్షనర్ల పెన్షన్ పెంపులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకం కానుంది. 7వ వేతన సంఘంలో ఉన్నట్టే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండాలనే ప్రతిపాదన వస్తోంది. లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. 7వ వేతన సంఘం సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా నిర్ణయించడంతో అప్పట్లో 7 వేలు ఉన్న కనీస వేతనం ఏకంగా 18 వేలకు పెరిగింది. ఇప్పుడు కూడా 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఏకంగా 157 శాతం పెరగనుంది. ఈసారి కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా నిర్ణయిస్తే కనీస వేతనం 18 వేల నుంచి ఏకంగా 51 వేలకు పెరుగుతుంది. అంటే దాదాపు రెండున్నర రెట్లు పెరుగుతుంది. 

అయితే మరి కొందరైతే ఈసారి అంటే 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92-2.86 మద్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జీతం పెంపు 92 శాతం నుంచి 186 శాతం ఉండవచ్చు. 

Also read: Ind vs NZ Match: ఇండియా న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇలా

​స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News