8th Pay Commission Salary DA Hike: 7వ వేతన సంఘం ప్రకారం ఈ ఏడాది జనవరి నెల డీఏ పెంపు ప్రకటన మరి కొద్ది రోజుల్లో రానుంది. మరో వైపు 8వ వేతన సంఘం కమిటీ కూడా ఏర్పడనుంది. అయితే ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు కొత్త ఫార్ములా సిద్ధమైంది. కొత్త వేతన సంఘంలో ఈ కొత్త ఫార్ములా ప్రకారమే జీతాలు పెరకబోతున్నాయి. అది కూడా ఏకంగా 157 శాతం పెరగవచ్చని అంచనా ఉంది.
దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలిగే ప్రకటన వెలువడనుంది. జనవరి నెల డీఏ పెంపుతో పాటు 8వ వేతన సంఘం విధివిధానాలు, కమిటీ ఏర్పాటు ప్రకటన వెలువడనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం జనవరి డీఏ పెంపు 3 శాతం ఉండవచ్చని అంచనా ఉంది. ఈ నెలలోనే అంటే హోలీ నాటికి డీఏ పెంపు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. 7వ వేతన సంఘం ప్రకారం గత ఏడాది జూలైలో డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. ఇప్పుడు మరో 3 శాతం పెరిగితే మొత్తం డీఏ 56 శాతం కానుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు ఎంత పెరుగుతాయనే అంశంపై చర్చ ఎక్కువగా ఉంది. ఈసారి జీతాల పెంపు కొత్త ఫార్ములా ప్రకారం నిర్ణయం కానుంది. 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఉద్యోగ సంఘాలు, మాజీ అధికారుల అంచనాలు అదే విధంగా ఉన్నాయి. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే 18 వేలు ఉన్న కనీస వేతనం కాస్తా ఏకంగా 51,480 రూపాయలు అవుతుందని అంచనా. అంటే ఏకంగా 157 శాతం జీతం పెరుగుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం నిర్ణయిస్తేనే ఇది సాధ్యమౌతుంది.
7వ వేతన సంఘం అమలైనప్పుడు కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా నిర్ణయించారు. అందుకే అప్పట్లో 7 వేలు ఉన్న కనీస వేతనం 18 వేలు అయింది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. జీతాలు భారీగా పెరగనున్నాయి. అటు జనవరి నెల డీఏ పెంపు ప్రకటన కూడా మరి కొద్ది రోజుల్లో రానుంది.
Also read: Indian Army Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









