Salary Hike Table: 8వ వేతన సంఘంలో కళ్లు చెదిరే జీతం, 33-83 వేల పెంపు, ఎవరికి ఎంత పెరుగుతుంది

8th Pay Commission Salary Hike Table: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరుగుతుందో స్పష్టత వచ్చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2025, 09:01 PM IST
Salary Hike Table: 8వ వేతన సంఘంలో కళ్లు చెదిరే జీతం, 33-83 వేల పెంపు, ఎవరికి ఎంత పెరుగుతుంది

8th Pay Commission Salary Hike Table: 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల్లో ఏకంగా 30-40 శాతం పెరగుదల రానుందని తెలుస్తోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందనే అంచనాలు ఉద్యోగుల్లో భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో జీతం ఎంత పెరుగుతుంది, పెన్షన్ ప్రయోజనాలు, హెచ్ఆర్ఏ, డీఏ ఎంత ఉంటుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తరువాత ఉద్యోగులు, పెన్షనర్లలో అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే జీతాలు భారీగా పెరగనున్నాయి. ఒకవేళ అందరూ అంచనా వేసినట్టుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస వేతనం 18 వేల నుంచి ఒకేసారి 51,480 రూపాయలకు పెరిగిపోతుంది. ఇది ఊహించని పెరుగదల. ఉద్యోగుల దశ మారిపోతుంది. ఒక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగడంతో కనీస వేతనం మారిపోతుంది. దాంతో ఉద్యోగికి అందే వివిధ రకాల ప్రయోజనాల్లో కూడా మార్పు వస్తుంది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఓ చుక్కానిలా పనిచేస్తుంది. 

8వ వేతన సంఘంతో కలిగే మార్పులు ఇవే

8వ వేతన సంఘం అమల్లోకి వచ్చేది జనవరి 2026
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.86 అంచనా
కనీస వేతనం  18 వేల నుంచి 51,480 రూపాయలు
గరిష్టంగా అన్ని పే స్కేల్స్ ఉద్యోగులకు వర్తిస్తుంది
జీతం 30-40 శాతం పెరుగుతుందని అంచనా
పెన్షనర్లు అందరికీ ప్రయోజనం
టేక్ హోమ్ శాలరీ, అలవెన్సుల్లో పెరుగుదల
హెచ్ఆర్ఏ, డీఏ, రిటైర్మెంట్ ప్రయోజనాల్లో మార్పు

8వ వేతన సంఘంతో జీతాల పెంపు, పెన్షన్ ప్రయోజనాల్లో మెరుగుదల, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అలవెన్సుల్లో పెరుగుదల కచ్చితంగా ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందనే అంచనా విన్పిస్తోంది. అందుకే ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త వేతన సంఘం ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడుతుంది. 

ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రానుంది. ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడి ఉద్యోగులు జీతభత్యాల్ని సమీక్షిస్తుంది. 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు ఫిట్‌‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించడంతో కనీస వేతనం 7 వేల నుంచి ఒక్కసారిగా 18 వేలకు పెరిగింది. 

8వ వేతన సంఘంతో ఏ ఉద్యోగికి జీతం ఎంత పెరుగుతుంది

పే లెవెల్ 1   18 వేల నుంచి 51,480 రూపాయలు     33,480 రూపాయల పెంపు
పే లెవెల్ 2   19,900 నుంచి 56,914 రూపాయలు     37,014 రూపాయల పెంపు
పే లెవెల్ 3   21,700 నుంచి 62,062 రూపాయలు     40,362 రూపాయల పెంపు
పే లెవెల్ 4   25,500 నుంచి 72,930 రూపాయలు     47,430 రూపాయల పెంపు
పే లెవెల్ 5   29,200 నుంచి 83,512 రూపాయలు      54,312 రూపాయల పెంపు
పే లెవెల్ 6   35,400 నుంచి 1,01,244 రూపాయలు   65,844 రూపాయల పెంపు
పే లెవెల్ 7  44,900 నుంచి 1,28,414 రూపాయలు   83,514 రూపాయల పెంపు

Also read: Lowest DA Hike: ఉద్యోగులకు భారీ షాక్, ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ డీఏ పెంపు కేవలం 2 శాతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News