8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు పెన్షన్ నిర్ణయించే 8వ వేతనం సంఘం త్వరలోనే ఏర్పడనుంది. మరో 2-3 వారాల్లో కమీషన్ ఏర్పాటు, సభ్యుల పేర్లు ఖరారు కానున్నాయి. కొత్త వేతన సంఘం ఏర్పాటు కోసం లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు సమీక్షించేందుకు ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘం ఏర్పడుతుంటుంది. ద్రవ్యోల్బణం, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ధిక పరిస్థితుల్ని బట్టి జీతభత్యాలు నిర్ణయిస్తుంటారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన సంఘం అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు కాగా 18 నెలల్లో రిపోర్ట్ సమర్పించింది. 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్లో ఉద్యోగులకు 23.55 శాతం జీతం పెరిగింది. ఆ సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించింది. దాంతో నెలకు కనీస వేతనం 7 వేలు కాస్తా 18 వేలకు పెరిగింది. ఈసారి 8వ వేతన సంఘం ఏర్పడితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.85 మద్యలో ఉండవచ్చని అంచనా.
8వ వేతన సంఘం ఏర్పాటుతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈసారి కనీస వేతనం 18 వేల నుంచి 45 వేలకు పెరగవచ్చని తెలుస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో 2-3 వారాల్లో కమీషన్ ఏర్పాటు కానుంది. కమీషన్ ఏర్పడి నివేదిక సమర్పించేందుకు కనీసం 12 నెలల సమయం పట్టవచ్చు.
Also read: Best Recharge Plans: రోజూ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 2 నెలల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









