8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఏప్రిల్ నెలలో భారీ జీతం ఎలాగంటే

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు రావల్సిన బకాయిలు ఈ ఏడాది భారీగా  అందుకోనున్నారు. 8వ వేతన సంఘం అమలు మరింత ఆలస్యం కానున్న నేపధ్యంలో ముందుగా బకాయిలు క్లియర్ చేసేందుకు సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2025, 10:48 AM IST
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఏప్రిల్ నెలలో భారీ జీతం ఎలాగంటే

8th Pay Commission: 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ కమీషన్ ఏర్పడక పోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. అందుకే ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు ముందుగా పెండింగు బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపి మూడు నెలలవుతోంది. అయినా ఇప్పటికీ కమీషన్ ఏర్పడలేదు. దాంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన సంఘం అమల్లోకి రావల్సి ఉంది. కొత్త వేతన సంఘం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనుంది. అందుకే ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. దాంతో ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు వివిధ రూపాల్లో రావల్సిన బకాయిలను వెంటనే చెల్లించేందుకు సిద్దమైంది. 

ముఖ్యంగా జనవరి డీఏను ఈసారి 2 శాతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మూడు నెలల డీఏ ఎరియర్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతం భారీగా అందనుంది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అందుకోనున్నారు. 

8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞాపన కూడా అందించారు. ఇదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం దాదాపుగా మూడు రెట్లు కానుంది. అందుకే ఉద్యోగులు కొత్త వేతన సంఘంపై చాలా ఆశలు అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈసారి ఈ ప్రక్రియ ఆలస్యం కానుండటంతో ఉద్యోగులకు నిరాశ కలగకుండా బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

Also read: Pan Card Alert: బిగ్ అలర్ట్ ఇదే చివరి అవకాశం, లేకపోతే మీ పాన్‌కార్డు రద్దయిపోతుంది జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News