8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఆమోదించిన తరువాత ఉద్యోగుల్లో జీతభత్యాల పెంపుపై చర్చ నెలకొంది. మొత్తం కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. కొత్త వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఉద్యోగుల జీతాలు ఏకంగా 62 వేలు పెరగవచ్చని తెలుస్తోంది.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లో ఉంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. ప్రస్తుతం ఉన్న కనీస వేతనంతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గుణిస్తే వచ్చేదే కొత్త జీతం. 7వ వేతన సంఘం అమల్లో వచ్చినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంది. దాంతో కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా ఉంది. అదే జరిగితే కనీస వేతనం ప్రస్తుతం 18 వేల రూపాయలు ఉంది. ఇది కాస్తా 51,480 రూపాయలకు పెరగనుంది. పెన్షన్ కూడా 9 వేల నుంచి 25,740 రూపాయలు అవుతుంది.
ప్యూన్ నుంచి క్లర్క్ వరకు జీతాలు ఎంత పెరుగుతాయి
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా ఉంది. ముఖ్యంగా ప్యూన్, అటెండెంట్ వంటి లెవెల్ 1 ఉద్యోగులకు కనీస వేతనం 18 వేల నుంచి 51,480 రూపాయలకు పెరుగుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్‌లకు 19,900 నుంచి 56,914 రూపాయలు కానుంది. ఇక కానిస్టేబుల్, స్కిల్క్ ఉద్యోగులు ప్రస్తుతం కనీస వేతనం 21,700 ఉంది. ఇది కాస్తా 62,062 రూపాయల కానుంది. ఇక స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్ ఉద్యోగులకు కనీస వేతనం 25,500 రూపాయల నుంచి 72,930 రూపాయలకు పెరగనుంది. అదే విధంగా సీనియర్ క్లర్క్, టెక్నికల్ ఉద్యోగులకు కనీస వేతనం 29,200 రూపాయల నుంచి 83,512 రూపాయలు కానుంది.
8వ వేతన సంఘంతో పెన్షనర్లకు కూడా భారీగా ప్రయోజనం కలగనుది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస పెన్షన్ 9 వేల నుంచి 25, 740 రూపాయలు కానుంది. 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని అంచనా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also read: Pan Card: మీ పాన్ కార్డు స్టేటస్ ఎలా తెలుసుకోవడం, యాక్టివేట్ చేయడమెలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి