8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘంపై స్పష్టమైన ప్రకటన చేసింది. 8వ వేతన సంఘం అమల్లోకి రావడం కాస్త ఆలస్యమైనా సరే ఉద్యోగులకు పూర్తిగా పెండింగ్ బకాయిలతో సహా ప్రయోజనం కలగనుంది. ఈసారి ఉద్యోగుల జీతభత్యాలు పెద్దఎత్తున పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ఇటీవలే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా మార్చ్ 27వ తేదీన చేసిన పోస్ట్ కూడా 8వ వేతన సంఘం ప్రయోజనాలను ధృవీకరిస్తుంది. 2016 జనవరి 1 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు ఆ తరువాత రిటైర్ అయినవారితో సమానంగానే ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. డిఫెన్స్ శాఖలోని పెన్షనర్లకు కూడా ప్రత్యేక నిబంధనల ప్రకారం పెన్షన్ ఉంటుందని వివరించారు. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్ని నిర్ణయించేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మాత్రమే. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే కనీస వేతనం నిర్ణయిస్తుంటారు. అందుకే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఈసారి ఎంత ఉంటుందనే అంచనాలు భారీగా ఉంటున్నాయి.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.6 నుంచి 2.85 మధ్యలో ఉండవచ్చని అంచనా ఉంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 30 శాతం వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పుడు 18 వేలు కనీస వేతనం ఉన్నవారికి ఏకంగా 40 వేలు దాటి ఉంటుందని అంచనా. 7వ వేతన సంఘం అమలైనప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంది. అప్పుడు కనీస వేతనం 23.55 శాతం పెరిగింది. ఇప్పుడు కనీస వేతనం 30 శాతం పెరగవచ్చని అంచనా. దాంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అందుకే ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు.
Also read: AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









