8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘంపై మంత్రి నిర్మల కీలక ప్రకటన, ఉద్యోగులకు భారీగా ప్రయోజనం

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్. త్వరలో అమల్లోకి రానున్న 8వ వేతన సంఘం పెన్షనర్లు, ఉద్యోగులకు భారీ ప్రయోజనం కల్గించనుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2025, 10:48 PM IST
8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘంపై మంత్రి నిర్మల కీలక ప్రకటన, ఉద్యోగులకు భారీగా ప్రయోజనం

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం నివేదికను నిర్ణీత సమయంలో విడుదల చేస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అందించాల్సిన ప్రయోజనాల గురించి కొత్త వేతన సంఘంలో సిఫార్సులు ఉంటాయి. 

Add Zee News as a Preferred Source

ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రకటించింది. ఈ కమిటీ ఇద్దరు సభ్యులు, ఒక ఛైర్మన్‌తో ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం డిసెంబర్ 31, 2025తో ముగియనుంది. దాంతో కొత్త వేతన సంఘం ఈలోగా నివేదికను సమర్పిస్తే 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చేందుకు వీలుంటుంది. అయితే కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ఇంకా 8వ వేతన సంఘం గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అమల్లోకి వచ్చేందుకు కాస్త ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగులు, పెన్షనర్లు తమకు అందే అదనపు ప్రయోజనాల కోసం మరి కొంతకాలం వేచిచూడాల్సి ఉంటుంది. వేతన సంఘం అనేది ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతుంటుంది. కొత్త వేతన సంఘం వచ్చిన ప్రతిసారీ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరిగింది. అందుకే ఉద్యోగులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. 

8వ వేతన సంఘంతో కలిగే ప్రయోజనాలు

కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే అన్ని పే స్కేల్ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్యూన్ లేదా అటెండర్ స్థాయి ఉద్యోగుల కనీస వేతనం ఇప్పుడు 18 వేలు ఉంటే కొత్త వేతన సంఘం అమల్లోకి రాగానే 51,480 రూపాయలకు పెరగనుంది. ఇక సీనియర్ క్లర్క్ , ఇతర సాంకేతిక సిబ్బందికి 29,200 నుంచి కనీస వేతనం 83,512 రూపాయలకు పెరగనుంది. ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరుగుతాయనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.86 శాతానికి చేయవచ్చని అంచనా ఉంది. గతంలో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ధారించడంతో అప్పట్లో 7 వేల రూపాయలుగా ఉన్న కనీస వేతనం ఒక్కసారిగా 18 వేల రూపాయలకు పెరిగింది. అందుకే ఉద్యోగుల్లో కొత్త వేతన సంఘంపై భారీగా అంచనాలు ఉన్నాయి. 

Also read: Rain Alert: తెలంగాణకు బిగ్ అలర్ట్, మరో మూడ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News