Aadhaar Rule changed: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు చాలా అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు పరమైన అన్ని పనులకు ఆధార్ కార్డు కీలకంగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఆధార్ కార్డుల్ని అప్‌డేట్ చేస్తుంటుంది. ఇప్పుడు మరో కొత్త అప్‌డేట్ చేసింది. ఫలితంగా ఇక నుంచి ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ కార్డ్ అథెంటికేషన్ చేయడానికి వీలు కలుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన మార్పు చేసింది. ప్రైవేట్ కంపెనీలు కూడా ఇక నుంచి ఆధార్ ఆధారిత ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసేందుకు వీలు కల్పించింది. మొబైల్ యాప్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు ఇకపై ఆధార్ సహిత ఫేస్ అథెంటికేషన్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ మార్పుతో హాస్పిటల్, హెల్త్, ఇ కామర్స్, ఎడ్యుకేషన్, క్రెడిట్ రేటింగ్ సేవలు మరింత సులభతరమౌతాయి. దీనికోసం సమాచార ఐటీ శాఖ కొత్త పోర్టల్ swik.meity.gov.in ఓపెన్ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు ఆధార్ వెరిఫికేషన్ సౌకర్యం అందించడం దీని వెనుక ఉద్దేశ్యం. ఆధార్‌కు సంబంధించి వచ్చిన ఈ మార్పుతో అర్హత కలిగిన సంస్థలు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్ కార్డు అనేది ఓ ఆప్షన్ మాత్రమే. కానీ కొన్ని ప్రభుత్వ పథకాలు, ట్యాక్స్ సంబంధిత సేవలకు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది.
ఆధార్ యాక్ట్ కొత్త నిబంధన ప్రకారం ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ అథెంటికేషన్ చేసేందుకు సాధ్యమౌతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖలకే ఆ సౌకర్యం ఉండేది. 2025 జనవరి 31న చేసిన సవరణతో ఇక ప్రైవేట్ సంస్థలు కూడా సులభంగా ఆధార్ అథెంటికేషన్ చేయవచ్చు.ఇది అమల్లోకి వస్తే కస్టమర్లు ప్రతి సారీ ఇ కేవైసీ లేదా పరీక్షల రిజిస్ట్రేషన్, ఇతర సేవలకు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్ అథెంటికేషన్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు సులభంగా ఉద్యోగుల హాజరు, గుర్తింపు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
ఆధార్ కార్డు నెంబర్ లేకుండానే ఆధార్ వెరిఫికేషన్ చేసేందుకు యూఐడీఏఐ వర్చువల్ ఐడీ కూడా ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు హోల్డర్లు అవసరమనుకుంటే తమ బయోమెట్రిక్ వివరాలు లాక్ చేసుకోవచ్చు.
Also read: MLC Elections: ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









