Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ అవలేదా ఇంకా, జూన్ 14 చివరి తేదీ

Aadhaar Card Update: ఆధార్ కార్డు  విషయంలో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. మీ ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరో అవకాశం ఉంది. ఇంకా అప్‌డేట్ చేయించకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 25, 2025, 09:35 PM IST
Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్ అవలేదా ఇంకా, జూన్ 14 చివరి తేదీ

Aadhaar Card Update: యూఐడీఏఐ ప్రకారం ఆధార్ కార్డు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాలి. అందుకే ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే పలుమార్లు డెడ్‌లైన్ పొడిగించగా ఇప్పుడు మరో అవకాశం జూన్ 14 వరకు మిగిలి ఉంది. రూల్స్ ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్ కార్డు అప్‌డేట్ అనేది అవసరం. 

Add Zee News as a Preferred Source

మీరు మీ ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయించుకునేందుకు ఇదే మంచి అవకాశం. జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవచ్చు. యూఐడీఏఐ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ఆన్‌లైన్ విధానంలో పూర్తిగా ఉచితంగా కొన్ని వివరాలు మార్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పదేళ్లకు ఓసారి ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్‌డేట్ చేయించుకోవాలి. ముఖ్యంగా అడ్రస్ అప్‌డేట్ ఉండాలి. ఎందుకంటే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు, బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, రుణాల కోసం అప్లై చేసేందుకు ఇది చాలా అవసరం. 

ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్, లాంగ్వేజ్ ప్రాధాన్యతలు మార్చుకోవచ్చు. అదే సమయంలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలు ఆధార్ కేంద్రంలో స్వయంగా నమోదు చేయించుకోవాలి. దీనికోసం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in ఓపెన్ చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవాలి. ఇక ఇప్పుడు డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకుని అవసరమైన కాగితాలు అప్‌లోడ్ చేయాలి. పూర్తిగా ఓసారి పరిశీలించి సబ్‌మిట్ చేయాలి. 

Also read: Heavy Rainfall: అల్పపీడనం, రుతు పవనాల ప్రభావం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు జాగ్రత్త

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News