Aadhaar Card Update: ఆధార్‌లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ ఎన్ని సార్లు మార్చుకోవచ్చో తెలుసా

Aadhaar Card Update: ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు అనేది తప్పనిసరి డాక్యుమెంట్గా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పనులకు సైతం ఆధార్ కీలకంగా మారింది. అందుకే మీ ఆధార్ కార్డు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2025, 10:47 PM IST
Aadhaar Card Update: ఆధార్‌లో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ ఎన్ని సార్లు మార్చుకోవచ్చో తెలుసా

Aadhaar Card Update: ఆధార్ కార్డు కార్డు ఎంత అవసరమో అది అప్‌డేట్‌గా ఉండటం కూడా అంతే ముఖ్యమైంది. లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్దిలో, బ్యాంక్ సంబంధిత సేవల్లో, లావాదేవీల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆధార్ కార్డు ప్రతి భారతీయుడు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధార్ ఎంత ముఖ్యమైందంటే ఇది లేకపోతే ఆఖరికి సిమ్ కార్డు కూడా కొనుగోలు చేయలేరు. 

Add Zee News as a Preferred Source

స్కూల్ అడ్మిషన్లు, కళాశాల అడ్మిషన్లు, ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ది, ఐడీ ప్రూఫ్ ఇలా దేనికైనా సరే ఆధార్ కార్డు తప్పకుండా ఉండాల్సిందే. అందుకే ఆధార్ కార్డులో ఉండే సమాచారం కచ్చితంగా ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలి. పేరు, ఇంటి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ వంటి వివరాలు పక్కాగా ఉండాలి. వీటిలో ఎప్పుడైనా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేసుకోవచ్చు. యూఐడీఏఐ ఆ వెసులుబాటు కల్గిస్తుంది. ఆధార్ కార్డు ఎన్ని సార్లు అప్‌డేట్ చేయవచ్చనేది ఆ అంశాల ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు ఫోన్ నెంబర్ లేదా అడ్రస్ అనేది ఎన్నిసార్లయినా అప్‌డేట్ చేయవచ్చు. జెండర్, పేరు, పుట్టిన తేదీ ఒకసారే మార్చేందుకు వీలుంటుంది. 

ఆధార్ కార్డులో అడ్రస్ ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. ఆన్‌లైన్‌లో తగిన డాక్యుమెంట్లు సమర్పించి ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అద్దె ఇళ్లలో ఉండటం లేదా ఉద్యోగ నిమిత్తం బదిలీలు అవుతుండటంతో అడ్రస్ మారుతుంటుంది. అందుకే ఎప్పటికప్పుడు అడ్రస్ మార్చుకునేందుకు వీలుంటుంది. 

ఇక ఫోన్ నెంబర్ కూడా స్థిరంగా ఒకటే ఉండకపోవచ్చు. ఉండాలని నిబంధన లేనందున ఆధార్ కార్డులో ఎన్నిసార్లయినా ఫోన్ నెంబర్ మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఎలాంటి లిమిట్ లేదు. ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. 

ఆధార్ కార్డులో పేరుని మాత్రం కేవలం రెండు సార్లే మార్చుకునేందుకు వీలుంటుంది. జీవితకాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఇక పుట్టిన తేదీ అయితే కేవలం ఒకసారే మార్చుకోవచ్చు.

Also read: AP Government: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఎక్కౌంట్లలో జమ అవుతున్న డబ్బులు మీ ఎక్కౌంట్ చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News