
hanuman chalisa in international flights video: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిముషాల్లోనే జనావాసాల మధ్య కుప్కకూలిపోయింది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కడు తప్ప మిగతా వారంతా మాంసపు ముద్దలుగా మారిపోయారు. అదే విధంగా విమానం మెడికోలు ఉన్న హస్టల్ మీద కూలడంతో దానిలో ఉన్న వారు సైతం దుర్మరణం చెందారు. మొత్తంగా ఈ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతునే ఉంది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు విమానంలో సాంకేతిక సమస్యలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది విమాన ప్రమాదం అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చాలా మంది ధైర్యం చేసి మరీ విమానం ఎక్కుతున్నారు.
अहमदाबाद प्लेन क्रेश के बाद आजकल बत्तियां बुझने के बाद इंटरनेशनल फ्लाइट्स में हनुमान चालीसा के सामूहिक पाठ हो रहे हैं। pic.twitter.com/KFxe66NgjO
— Arvind Chotia (@arvindchotia) June 16, 2025
అయితే.. విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మాంసపు ముద్లలుగా మారిన కూడా ఒక భగవద్గీత గ్రంథం మాత్రం చెక్కుచెదరకుండా బైటకు వచ్చింది. దీంతో దేశమంతట కూడా ఈ ఘటన షాక్ కు గురిచేసింది. అయితే.. ప్రస్తుతం చాలా చోట్ల అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు హనుమాన్ చాలీసాను పఠిస్తు ప్రయాణాలు చేస్తున్నారు. హిందువులు హనుమాన్ చాలీసాను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ఎన్నికష్టాలు ఉన్న కూడా హనుమాన్ పేరు గానీ, హనుమాన్ చాలీసా చదివితే..ఆ సమస్యలు అన్ని దూరమౌతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. చాలా మంది హనుమాన్ చాలీసాను తమ వెంట పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో గతంలో అయోధ్య రామజన్మభూమి రామ్ లల్లాప్రతిష్టాపన సమయంలో విమానాల్లో, ట్రైన్ లలో హనుమాన్ చాలీసాను పఠించడం చూశాం.
మరల ఇప్పుడు పలు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులు హనుమాన్ చాలీసా పఠిస్తు ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ప్రయాణికులు సాముహికంగా హనుమాన్ చాలీసా పఠిస్తు,తమ జర్నీ చేస్తున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.