madhya pradesh minister vijay shah latest controversy: జమ్ములోకి పహల్గంలో ఉగ్రవాదులు అమాయకులైన 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు.. ఈక్రమంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాక్ కు గట్టిగా బుద్ది చెప్పింది. అయితే.. పాక్ ఫెక్ ప్రచారంను.. భారత్ కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎప్పటికప్పుడు మీడియా వివరాలు వెల్లడిస్తు పాక్ కుయుక్తుల్ని తిప్పికొట్టారు.
ఈ క్రమంలో దేశమంత కూడా వీళ్లను రియల్ హీరోలుగా ప్రశంసిస్తుంటే.. కొంత మంది వీరిని కూడా ట్రోల్స్ చేశారు. అయితే.. కొంత మంది రాజకీయ నేతలు బాధ్యయుతమైన స్థానంలో ఉండి కూడా.. కాంట్రవర్సీ మాటలతో అగ్గిరాజేశారు.
మధ్య ప్రదేశ్ మంత్రి విజయ్ షా మాట్లాడుతూ.. కల్నల్ సోఫియా.. టెర్రరిస్టులకు సోదరి అని, ముస్లిం వనిత అంటూ కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు. ఇది దేశంలో పెద్దవివాదం రాజేసింది. ఏకంగా మధ్య ప్రదేశ్ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. డీజీపీని వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో విజయ్ షా.. సుప్రీంకోర్టు వెళ్లడంతో.. అక్కడ కూడా అత్యున్నత ధర్మాసనం.. మంత్రికి చివాట్లు పెట్టింది. దీంతో దిగొచ్చిన ఆయన కల్నల్ సోఫియా ఖురేషికి సారీ చెప్పారు.
Read more: Parliament: పార్లమెంట్ వర్షాకాల షెడ్యూల్ ఖరారు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. పూర్తి డిటెయిల్స్ ఇవే..
ఈ సారీని కూడా సుప్రీంకోర్టు నిజమైన పశ్చాత్తాపంగా పరిగణించలేదు. దీనిపై విచారణకు కమిటిని కూడా ఏర్పాటు చేయాలని ఎంపీ సర్కారును ఆదేశించింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలో మరోసారి మంత్రి విజయ్ షాచేసిన పని ఆయన మెడకు చిక్కుకుంది. విజయ్ షా.. ఇటీవల ఖాండ్వాలో హత్యాచారానికి గురైన బాధిత కుటుంబాన్ని మంత్రి విజయ్ షా పరామర్శించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ.. నాయకులను, పార్టీ కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఫోటోల్ని దిగారు. ఆ తర్వాత ఆ ఫోటోల్ని.. తన సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వివాదంగా మారింది.
గోప్యంగా ఉంచాల్సిన ఘటనను.. ఏకంగా మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి.. బాధితుల మనోభావాలతో పాటు.. వారి స్థైర్యంను దెబ్బతిశాడని మధ్య ప్రదేశ్ అపోసిషన్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో మరోసారి మంత్రి మెడకు కొత్త వివాదం చుట్టుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









