Dead body in drum Ludhiana: ఐపాయ్.. వెలుగులోకి మేరఠ్ డ్రమ్ లాంటి మరో ఉదంతం.. ఈసారి ఎక్కడంటే..?

Mans body found in blue drum punjab: డ్రమ్ లో ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.  వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీని వల్ల మరోసారి డ్రమ్ అంశం మరోసారి వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 27, 2025, 02:17 PM IST
  • వెలుగులోకి మరో డ్రమ్ లాంటి ఘటన..
  • విచారణ చేపట్టిన పోలీసులు..
Dead body in drum Ludhiana: ఐపాయ్.. వెలుగులోకి మేరఠ్ డ్రమ్ లాంటి మరో ఉదంతం.. ఈసారి ఎక్కడంటే..?

man's body found in blue drum in Ludhiana probe on: ఇటీవల కాలంలో కట్టుకున్న భార్యలు తమ భర్తల్ని అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తున్న ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. అయితే.. కొన్నిచోట్ల భార్యలు తమ భర్తల్ని చంపుతుంటే.. మరికొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని హత్యలు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

దీంతో అసలు వివాహ బంధం అంటేనే చాలా మంది యువతీ, యువకులు కిలో మీటర్ దూరం పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో..  యూపీలో గతంలో ప్రియుడి వల్లో పడి.. తన భర్తను మేరఠ్ కు చెందిన ముస్కాన్న హత్య చేసిన విషయం తెలిసిందే.

తన భర్తను చంపి... 15 ముక్కలు చేసి ఇంట్లో డ్రమ్ తీసుకొచ్చి దానిలో శరీరం ముక్కలు వేసి పై నుంచి సిమెంట్ వేసి క్లోజ్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. తాజాగా.. ఈ కోవకు చెందిన మరో ఘటన పంజాబ్ లో వెలుగులోకి వచ్చింది.

 పంజాబ్ లోని లుథియానాల ఒక నీలం రంగు డ్రమ్ ను స్థానికులు గుర్తించారు. దానిలో చూడగా.. ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు.

అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  కొంత మంది ఘటన వెలుగులోకి వచ్చిన చోట మాస్క్ లు ధరించి అనుమానస్పదంగా తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.  జాగీలాలతో చేపట్టిన తనిఖీలలో కొన్ని ఎవిడెన్స్ లు దొరికినట్లు సమాచారం. మరోవైపు.. చనిపోయిన వ్యక్తి.. 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read more: Elephants in Rath Yatra Video: జగన్నాథుడి రథయాత్రలో షాకింగ్.. మూడు ఏనుగుల బీభత్సం.. తొక్కిసలాట.. వీడియో వైరల్..

 ఈ క్రమంలో అసలు..అతను సూసైడ్ చేసుకున్నాడా..?.. ఎవరైన చంపి డ్రమ్ లో పెట్టారా..?.. కొంపదీసి భార్య ఎవరైన..చంపి అతడ్ని కొత్త డ్రమ్లో ప్రియుడితో కలిసి పడేసిందా..?.. అన్న కోణాలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి డ్రమ్ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News