Encounter: జమ్మూకశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం..కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్..భద్రతా బలగాలకు చిక్కిన TRF కమాండర్?

Encounter: జమ్ముకశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరుగుతోంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ చిక్కినట్లు తెలుస్తోంది. 

Written by - Bhoomi | Last Updated : Apr 23, 2025, 08:27 PM IST
Encounter: జమ్మూకశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం..కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్..భద్రతా బలగాలకు  చిక్కిన TRF కమాండర్?

Encounter: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన  ఉగ్రవాద దాడి తర్వాత, ఉగ్రవాదులపై సైన్యం ఆపరేషన్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. బుధవారం ఉదయం ఉరి సెక్టార్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇది పహల్గాం దాడికి కొన్ని గంటల తర్వాతే జరగడం గమనార్హం. తంగ్ మార్క్ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ భద్రతా బలగాలకు చిక్కినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  ఎన్ కౌంటర్ స్థలంలో గాలింపు కొనసాగుతోంది. 

Add Zee News as a Preferred Source

కాగా మంగళవారం పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత తమదే అంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముందుకు వచ్చింది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. మరోవైపు ఈ రోజు తెల్లవారుజామున భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భారత సైన్యం అడ్డుకుంది. వారిపై జరిపిన కాల్పుల్లో ఇద్దరూ మరణించారు.

Also Read: HCL Share: క్యూ4 రిజల్ట్స్ ఊపుతో దూసుకెళ్తున్న HCL షేర్ ధర...ఇంట్రాడేలో 7 శాతం లాభం...మీరు ఓ లుక్ వేయండి  

ఎన్ కౌంటర్ అనంతరం భారీగా ఆయుధాలు మందుగుండు సామగ్రి, పాకిస్తాన్ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో గస్తీలు, తనిఖీలు మరింత కఠినం చేశాయి. ఈ ఘటన నేపథ్యంలో మరోసారి దేశ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉగ్రవాద చర్యలకు గట్టి ప్రతిస్పందన ఇవ్వాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: Gold Rate: నమ్మలేకపోతున్నారా...తులం బంగారం ధర కేవలం రూ. 73000 మాత్రమే ఎక్కడో తెలిస్తే షాక్ తినడం ఖాయం..?   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News