)
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఎండియా విమానం ఘోర ప్రమాదానికి గురై 265 మంది మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపగా ఇద్దరు మాత్రం తృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. దేవుడి ఆయువు ఇస్తే ఇలానే ఉంటుంది మరి.
జూన్ 12 మద్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 జనావాసాలపై కుప్పకూలడంతో విమానంలోని 241 మందితో పాటు విమానం కూలిన మెడికల్ కళాశాల భవనంలో 24 మంది మెడికోలు మరణించారు. కానీ ఇద్దరికి మాత్రం దేవుడు ఆయువు రాసిపెట్టాడు. అందుకే ఆ ఇద్దరూ తప్పించుకున్నారు. ప్రయాణం వాయిదా ఒకరి ప్రాణాలు కాపాడితే, 10 నిమిషాల ఆలస్యం మరొకరికి ఆయువు పోసింది. దేవుడు రాసిన విధి ఇది.
గుజరాత్‌కు చెందిన 60 ఏళ్ల సవ్జీ భాయ్ టింబడియా లండన్‌కు వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గురైన విమానంలో టికెట్ బుక్ అయింది. సీట్ నెంబర్ కూడా కేటాయింపబడింది. కానీ వ్యక్తిగత కారణాలతో సరిగ్గా 4 రోజుల క్రితం ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. అలా అతని ప్రాణం దక్కింది. అంతా దేవుడి లీల అని సవ్జీ భాయ్ చెబుతున్నాడు.
ఇక కేవలం 10 నిమిషాల ఆలస్యం మరో యువతి ప్రాణాలు కాపాడింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు భూమి చౌహాన్ అనే యువతి ఇదే విమానంలో టికెట్ బుక్ చేసుకుంది. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో దారిలో ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఫలితంగా 10 నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే విమానం టేకాఫ్ అయింది. రెండే నిమిషాల్లో విమానం కుప్పకూలింది. ఈ విషయం తెలియగానే ఆమె షాక్‌కు గురైంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో ప్రాణాలు దక్కించుకోవడంపై ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ దేవుడే తనను కాపాడినట్టు చెబుతున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook