Ahmedabad Plane crash Video: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్‌లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్ చేసినట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘానిననగర్ సమీపంలో కుప్పకూలిపోయింది. విమానాశ్రయం నుంచి ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
#PlaneCrash: Air India's AI171 (Ahmedabad- London) with around 242 passengers on board has reportedly crashed near #Ahmedabad (AMD) airport during take off.
Official confirmation awaited.#Aviation pic.twitter.com/7qmPfIwaaw
— The Chennai Skies (@ChennaiFlights) June 12, 2025
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ఈ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీం లైనర్ గా సమాచారం. ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటిక కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. ఇప్పటికే ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విమానం మధ్యాహ్నం 1: 17 గంటలకు టేక్ ఆఫ్ కాగా.. 1:50 గంటలకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అని చెప్పారు. మొత్తంగా ఈ విమాన ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదంతో ఆ ప్రాంతాల్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉండొచ్చని వార్తలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం మేఘానీనగర్ లో కుప్పకూలింది. సమాచారం ప్రకారం ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని అక్కడ నుంచి లండన్‌కు బయలుదేరుతుంది.
కూలిన విమానంలో మాజీ సీఎం..?
అయితే ఈ రోజు ఈ కుప్పకూలిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం విజయ రూపాని కూడా ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: తల్లికి వందనం అకౌంట్‌లలోకి రూ.13,000.. మిగతా రూ.2000 కోత ఎందుకంటే?
Also Read: జియో సూపర్‌హిట్ ప్లాన్.. రూ.895 కే 11 నెలల వ్యాలిడిటీ పొందే ఛాన్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.