Plane crash trgedy gujarat ex cm vijay rupani dead body identified: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈక్రమంలో ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య.. 279 కి చేరింది. మరోవైపున అధికారులు విమాన ప్రమాదంలో చనిపొయిన వారి మృతదేహలను డీఎన్ఏ టెస్టులతో గుర్తింపు చేసే పనుల్లోపడ్డారు. ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యుల నుంచి సాంపుల్స్ తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో బీజే ఆస్పత్రి అంత డీఎన్ఏ సాంపుల్ ఇచ్చే వారితో కిట కిటలాడుతుంది. అయితే.. ఇప్పటి వరకు.. 32 మంది మృతదేహలు డీఎన్ ఏలతో సరిపోలినట్లు వైద్యులు తెలిపారు. అదే విధంగా 14 మంది మృతదేహలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈనేపథ్యంలో గుజరాత్ మాజీ మంత్రి విజయ్ రూపానీ మృతదేహంను కూడా డీఎన్ ఏ టెస్టులతో గుర్తించినట్లు బీజే ఆస్పత్రి సీనియర్ డాక్టర్ తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఆయన భౌతికకాయాన్ని నిర్ధారించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు.
విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న నమూనాలతో, ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం డీఎన్‌ఏ సాంపుల్ తో సరిపోయిందన్నారు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులకు విజయ్ రూపానీ భౌతికకాయాన్ని అప్పగించినట్లు వెల్లడించారు.
మరోవైపు విజయ్ రూపానీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో రాజ్ కోట్ లో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ రూపానీ ఇంటి దగ్గర భారీగా నేతలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఈ నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 274 మంది దుర్మణం చెందారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.