Ahmedabad plane crash survivor vishwas kumar ramesh latest video: అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయట పడిన ఘటన ప్రపంచంలోనే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విశ్వాస్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు . అయితే.. విమానంలోటేకాఫ్ అయిన కొన్ని నిముషాలకే జనావాసాల్లో పడి భారీగ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ పేలిపోయింది. విశ్వాస్ కుమార్ రమేష్ విమానంలో 11 ఏ సీటులో కూర్చున్నాడు.
విమాన ప్రమాదం జరిగినప్పుడు భారీ పేలుడుకు విమానం రెండు ముక్కలైంది. దీంతో విశ్వాస్ కుమార్ సీటుతో పాటు ఎగిరి విసిరివేయబడ్డాడు. దీంతో అతను చిన్నపాటి గాయాలతో మాత్రం బైటకు వచ్చాడు. అతను దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న నడ్చుకుంటూ రావడం పెద్ద సంచలనంగా మారింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, పైలట్లు, ప్రయాణికులు, హాస్టల్ భవనంలోనిమెడికో విద్యార్థులు సహా 274 మంది మృతి చెందారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతుల్లో ఉన్నారు.
A new video from the Air India plane crash site in Ahmedabad has emerged, showing Vishwas, the sole survivor in the accident, walking away from the crash site.
11A
#AhmedabadCrash#AirIndiaPlaneCrash #planecrashes pic.twitter.com/aQ2uVOrujK— sam (@sam303T) June 16, 2025
ఈ ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ (40) ఒక్కరే ప్రాణాలతో బతికి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే.. ప్రస్తుతం బీజే ఆస్పత్రి వైద్యులు డీఎన్ ఏ టెస్టులు చేసి చనిపొయిన వారి డెడ్ బాడీస్ లను వారి బంధువలకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 65 మంది కుటుంబాలకు డెడ్ బాడీస్ లను అప్పగించారు. మరోవైపు 90 మంది వరకు డెడ్ బాడీలను.. వారి కుటుంబాల డీఎన్ ఏ టెస్టులతో పొల్చి గుర్తించారు.
ఈ క్రమంలో ప్రస్తుతం విమాన ప్రమాదం నుంచి బైటపడిన మృత్యుంజయుడు మరోసారి వార్తలలో నిలిచాడు. విమానం కుప్పకూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. చుట్టు దట్టమైన పొగలు వ్యాపించాయి. రోడ్డుమీద ఉన్న కొంత మంది భయంతో కేకలు వేస్తున్నారు.
కానీ విశ్వాస్ కుమార్ రమేష్ అంత భీకరమైన పొగల నుంచి తాపీగా నడ్చుకుంటూ బైటకు వచ్చాడు. అతడ్ని చూసి అక్కడున్న వారు షాక్ తో నోరెళ్లబెట్టారు. ఈ కొత్త వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.









