two heads identified in one bag Ahmedabad Plane Crash tragedy: అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అయిన నిముషాల వ్యవధిలోనే సమీపంలోని జనావాసాల మధ్య కుప్పకూలీపోయింది. ఈ ఘటనలనో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కడు తప్ప మిగత వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మరోవైపు ఈ విమానం.. మెడికొలు ఉంటున్న హస్టల్ మీద పడటంతో అక్కడ కూడా 33 మంది మెడికోల్ మరణించారు. ఇప్పటి వరకుఈ ఘటనలో 275 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో ఘటన ప్రదేశంలో శరీర భాగాలంతా ముద్దులుగా మారిపోయాయి. విమానం పేలిపోయినప్పుడు భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంత రెప్పపాటులో మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఈక్రమంలో వారిని గుర్తించడానికి ప్రస్తుతం బాధిత కుటుంబాల నుంచి డీఎన్ ఏ సాంపుల్ స్వీకరించి మృతదేహాల్ని గుర్తించే పనిలో డాక్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ౩౩ మంది వరకు మృతదేహాల్నిడీఎన్ ఏ టెస్టులతో గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
అదే విధంగా 14 మంది కుటుంబాలకు వారి బంధువుల మృతదేహాలను అప్పగించారు. ఈ క్రమంలో.. మృతుల ఆనవాళ్లను గుర్తించడానికి డీఎన్ ఏ టెస్ట్ మాత్రమే ఏకైక మార్గం కావడంతో పెద్ద ఇబ్బందిగా మారింది. అయితే.. మృతుల బంధువులు.. తమవారిని ఎలాగైన కాపాడలేకపోయారు. కనీసం వారి మృతదేహల్ని అయిన అప్పగించాలని కోరడం అందర్నికలిచి వేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు.. ప్రయాణికుల శరీర అవయవాలన్ని ముద్దులుగా మారిపోయాయని.. వాటిలో తాము డీఎన్ ఏ టెస్టులతో గుర్తించి మరీ అప్పగిస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలో సివిల్ ఆస్పత్రిలో ఒక బ్యాగులో ఒక బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి తల అంటు ఇచ్చారు. తీరా ఆ బ్యాగ్ తెరిచి చూస్తే దానిలో రెండు తలలు కన్పించాయి. దీంతో అతను వైద్యులకు ఈ విషయం చెప్పాడు. దయచేసి.. తమ వాళ్ల శరీర భాగాల్ని అయిన తమకు అంత్యక్రియల కోసం దక్కెలా చూడాలని వేడుకొవడం అందర్ని కలిచివేసింది. మరోవైప వైద్యులు సైతం.. ఈ ఘటన ప్రభావ తీవ్రత గురించి బాధితులకు చెప్పే ప్రయత్నాలుచేస్తున్నారు.
మరోవైపు..మృతదేహాల అప్పగింత ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు సివిల్ ఆసుపత్రి అధికారులు శనివారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. డీఎన్ఏ నమూనా ఇచ్చిన బంధువుతు మాత్రమే మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పారు.
Read more: Vijay Rupani: విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు.. అంత్యక్రియలు ఎక్కడంటే..?
కానీ అత్యంత అరుదైన సిట్యూవేషన్ ఉంటే బంధువులు.. అన్నిరకాల గుర్తింపు కార్డులు, చనిపోయిన వారితో సంబంధాలపై ఆధారాలు చూపిస్తే వారికి మాత్రమే మృతదేహాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈక్రమంలో.. మృతదేహాల తరలింపునకు ఎయిర్ ఇండియా, రోడ్డు మార్గాల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.