Asaduddin Owaisi serious on trolls over Vikram misri amid india Pakistan war: భారత్ పాక్ మీద పహల్గం ఉగ్రకుట్రకు ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై దాడిచేసింది.ఆ తర్వాత దాయాది మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడటంతో.. పాక్ కు బుద్ది చెప్పాలని రంగంలోకి దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ కు చుక్కలు చూపించింది. డ్రోన్ లు, మిసైల్ దాడుల్ని పూర్తిగా నిర్విర్యం చేసింది.
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను యావత్ భారతా వణి స్వాగతించింది.అయితే.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఆయనకు ఏ మాత్రం చాన్స్ దొరికిన దాయాదిని ఏకీపారేస్తున్నారు. పాక్ ను అఫిషియల్ బిచ్చగాడిలా అభివర్ణించారు. ఇస్లాంలో అమాయకుల్ని, చిన్నపిల్లలపై దాడులు చేయాలని లేదన్నారు.
Mr Vikram Misri is a decent and an Honest Hard working Diplomat working tirelessly for our Nation.
Our Civil Servants work under the Executive this must be remembered & they shouldn’t be blamed for the decisions taken by The Executive /or any Political leadership running Watan E… https://t.co/yfM3ygfiyt— Asaduddin Owaisi (@asadowaisi) May 11, 2025
కొంత మంది మతోన్మాదులు ఇస్లాం పేరు చెబుతూ. అమాయకులైన యువతను పెడతోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఐఎంఎఫ్ కూడా పాక్ కు ఫండ్ ఇవ్వడాన్ని అసదుద్దీన్ తీవ్రంగ పరిగణించారు.ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వార్తలలో నిలిచారు. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను ఎప్పటికప్పుడు.. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో పాటు విలేకర్ల సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో ఇండియా,పాక్ ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ జరిగింది. దీనిపై కొంత మంది విక్రమ్ మిస్రీని టార్గెట్ చేసుకునిట్రోల్స్ చేశారు. దీనిపై హైదరాబాద్ ఎంపీ సంచలన ట్విట్ చేశారు. విక్రమ్ మిస్రీఎంతో నిజాయితీ గల అధికారి అని చెప్పుకొచ్చారు.
ఆయన దేశం కోసం.. నిరంతరం కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఎవరైన ఆయన్ను నిందిస్తే.. ట్రోల్స్ చేస్తే మ్యాటర్ సీరియస్ అవుతుందంటూ ఎక్స్ వేదికగా ట్రోలర్స్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. విక్రమ్ మిస్రీ జమ్మలోని కశ్మీరీ కుటుంబానికి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook