Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా AIMPLB ఆందోళనలకు తాత్కాలిక విరామ ప్రకటన.. మూడు రోజుల తర్వాత మళ్లీ

Pahalgam Terror Attack: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో  అమాయకులైన  పర్యాటకులు,  ఇతర పౌరులు అసువులు బాసిన నేపథ్యంలో  ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రస్తుతం కొనసాగిస్తున్న నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Written by - Bhoomi | Last Updated : Apr 23, 2025, 08:43 PM IST
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా AIMPLB ఆందోళనలకు తాత్కాలిక విరామ ప్రకటన.. మూడు రోజుల తర్వాత మళ్లీ

Pahalgam Terror Attack: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో  అమాయకులైన  పర్యాటకులు,  ఇతర పౌరులు అసువులు బాసిన నేపథ్యంలో  ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రస్తుతం కొనసాగిస్తున్న నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వక్ఫ్ సవరణలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు   గత కొంతకాలంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా  వక్ఫ్ రక్షణ కోసం  ఉద్యమాలు చేపడుతున్నారు. అయితే తాజాగా  కాశ్మీర్లోని పహాల్గంలో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది మరణించగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన తమను తీవ్రంగా కలిసి వేసిందని ఈ సందర్భంగా AIMPLBకి చెందిన వక్ఫ్ రక్షణ కోసం ఏర్పాటైన మజ్లిస్-ఎ-అమల్ జాతీయ సమన్వయకర్త డా. ఎస్‌క్యూ ఆర్ ఇల్యాస్ తెలిపారు. దాడిలో బాధితుల కుటుంబాలకు సంఘీభావంగా తీసుకున్న నిర్ణయమని  ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

Add Zee News as a Preferred Source

కాగా  వక్ఫ్ చట్ట సవరణలపై AIMPLB నిర్వహిస్తున్న ఉద్యమానికి విరామం  మూడు రోజుల పాటు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి కాంపెయిన్ నిర్వాహకులకు ఒక సర్క్యులర్ పంపించామని, మూడు రోజుల పాటు అన్ని ఉద్యమ కార్యకలాపాలను తక్షణమే ఆపేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అయితే మూడు రోజుల తర్వాత నిరసన కార్యక్రమాలు మళ్లీ యధాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.

 

డా. ఇల్యాస్ ఈ సందర్భగా మాట్లాడుతూ, కాశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఈ ఉగ్రదాడిని  అన్ని రకాలుగా ఖండిస్తున్నామని ఏమాత్రం సహించరానిదని ఇది మానవత్వానికి మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలందరి తరఫున మేము ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాల పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం అని పేర్కొన్నారు.

Also Read: Encounter: జమ్మూకశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం..కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్..భద్రతా బలగాలకు  చిక్కిన TRF కమాండర్?   

 ఇదిలా ఉంటే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది మృతి చెందారు. పల్గామ్ లో జరిగిన దాడిలో పర్యాటకులపై  ఉగ్రవాద మూకలు  విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో,  28 మంది సంఘటనా స్థలంలోనే నేలకోరిగారు. మరో 20 మంది తీవ్రంగా క్షతగాత్రులు అవడంతో వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనపై యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. 

ప్రధాని నరేంద్ర మోడీ  ఈ ఘటనపై అత్యున్నత సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రస్తుత పరిస్థితిపై  రక్షణ శాఖ, హోం శాఖ అధికారులతో కలిసి  సమీక్ష నిర్వహిస్తున్నారు.  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని  తెలుసుకున్నారు. అలాగే క్షతగాత్రులను సైతం పరామర్శించారు.  ఈ ఘటనపై  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, యూకే ప్రధానమంత్రి కియర్‌ స్టార్మర్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్  సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై  పోరులో అందరం కలిసి సమిష్టిగా  పరస్పర సహకారం అందించుకోవాలని ఈ సందర్భంగా వారు ఆశించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News