Air Asia Offer: బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు కేవలం 5 వేలకే ఫ్లైట్ టికెట్ ఎలాగంటే

Air Asia Offer: విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా మాన్‌సూన్ వెకేషన్ విదేశాల్లో ప్లాన్ చేసేవారికి అద్భుతమైన అవకాశం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ కేవలం 5 వేలకే లభించనుంది. ఆశ్చర్యంగా ఉందా..ఈ ఆఫర్ చెక్ చేయండి ఓసారి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2025, 02:21 PM IST
Air Asia Offer: బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు కేవలం 5 వేలకే ఫ్లైట్ టికెట్ ఎలాగంటే

Air Asia Offer: మాన్‌సూన్ వెకేషన్ చాలా మంది ముందే ప్లాన్ చేస్తుంటారు. ఈసారి వేసవి తరువాత విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే ఈ ఆఫర్ మీ కోసమే. బ్యాంకాక్, కౌలాలంపూర్‌లో మాన్‌‌సూన్ వెకేషన్ గడిపేందుకు అత్యంత చౌక ధరకే వెళ్లవచ్చు. ఎయిర్ ఏసియా ఆఫర్ వెంటే కళ్లు చెదిరిపోతాయి. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంది, టికెట్ ధర ఎంతనే వివరాలు మీ కోసం.

Add Zee News as a Preferred Source

మాన్‌సూన్ వెకేషన్ విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే ఇప్పుడే మీ టికెట్ బుక్ చేసుకోండి. ప్రయాణం మీ ఇష్టం ఎప్పుడైనా చేయవచ్చు. ముఖ్యంగా బ్యాంకాక్, కౌలాలంపూర్ దేశాలకు కేవలం 5 వేలకే వెళ్లవచ్చు. ఎయిర్ ఏసియా ఈ ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ ప్రాంతాలకు ఫ్లైట్ టికెట్ కేవలం 5 వేలకే లభించనుంది. 2025 జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకూ ప్రయాణించవచ్చు. జీరో బేస్ ఫేర్ పేరుతో ఎయిర్ ఆసియా ఈ ఆఫర్ ప్రకటించింది. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌తో పాటు తిరుచినాపల్లి నుంచి బ్యాంకాక్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కోసం టికెట్ల బుకింగ్ ఇప్పుడే చేసుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి బుకింగ్ ప్రారంభమైంది. 23వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. అంటే ఈ వారంలో టికెట్ బుక్ చేసుకుని జూలై నుంచి ఏడాది వ్యవధిలో ఎప్పుడైనా బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు వెళ్లవచ్చు. 

విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్‌కు టికెట్ సాధారణంగా 7500 రూపాయల నుంచి 12 వేల వరకు ఉంటుంది. కానీ ఈ ఆఫర్‌లో 4400 నుంచి 5 వేల మధ్యలో టికెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ అన్ని కేటగిరీల ప్రయాణీకులకు వర్తిస్తుంది.

Also read: Kesineni Nani: కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లో వస్తున్నారా, అసలేం జరుగుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News