Ahmedabad Air India AI Short Film Video: ఏఐ ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో కూడుకున్నది. దీంతో అనేక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ కూడా నెట్టింటా వైరల్ అవుతుంది. కళ్ళకు కట్టినట్లుగా ప్రమాదం ఎలా జరిగిందో చూపించారు. ప్రధానంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన యావత్ భారత నీ కుదిపేసిన సంగతి తెలిసిందే. విమాన ప్రయాణ సమయంలో అందులో ఉన్న 241 మంది మరణించారు. ఏఐ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విమానం టేక్ ఆఫ్ మెడికల్ కాలేజీలో స్టూడెంట్ లంచ్ చేస్తున్న సమయంలో ఫ్లైట్ కుప్ప కూలిపోవడంతో వాళ్ళు కూడా అక్కడికక్కడే చనిపోవడం అది బ్లాస్ట్ అయిన పరిస్థితులు.. అప్పటివరకు సంతోషంగా ఉన్నవారు ఒక్క క్షణంలో విగత జీవులుగా ఎలా మారారో ఈ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా షార్ట్ ఫిల్మ్ తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎన్నో వ్యూస్ కూడా పొందుతుంది.
గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా లండన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం అక్కడి నుంచి లండన్ కు బయలుదేరింది. ఈ క్రమంలో మేఘనీ నగర్ లో ఈ ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్ అవ్వడంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 279 మంది మృతి చెందారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోవడంతో భారీ మంటలు వ్యాపించి అందులో ప్రయాణించే అందరూ చనిపోయారు.
Film on #Ahmedabad, #AirIndiaPlaneCrash #planecrashahmedabad
animation is so much realistic & Thanks to #ArtificialIntelligence pic.twitter.com/2Oese6aFsu— Sudarshana Chakra (@Sudarshn_chakra) June 18, 2025
ఇక ఇంజన్లు పనిచేయకపోవడంతో తిరిగి రన్ వే పైకు తీసుకువచ్చేందుకు పైలట్లు ప్రయత్నించిన జరిగే విషాదం జరిగిపోయింది. అయితే సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు వైరల్ కూడా అయ్యాయి. రైడర్ ప్రకారం 625 అడుగుల ఎత్తులో ఫ్లైట్ ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘోర ప్రమాదం నుంచి ఒకే ఒక్కరు బయటపడ్డాడు సీట్ నెంబర్ 11 ఏ లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక మిగతా అంతా చనిపోయారు. ప్రయాణ సమయంలో 230 మంది ప్రయాణికులు పది మంది క్రూ సిబ్బంది ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం 242 మంది ప్రయాణించారు. ఇందులో 241 మంది దుర్మరణం చెందారు. ఇక ఈ ఫ్లైట్ మెడికల్ కాలేజీ భవనంలో కూలడంతో అక్కడ లంచ్ సమయం కావడంతో మెడికోలు 38 మంది వరకు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య భారీగానే పెరిగింది. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు .53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు వారు కూడా ఇందులో ఉన్నారు.ప్రస్తుతం డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలు గుర్తింపు చేసి వారి కుటుంబాలకు అప్పగించారు. ఎయిర్ ఇండియా ఇప్పటికీ భారీగానే పరిహారం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.
Also Read : Donald Trump: ఇజ్రాయెల్ దాడి సరైందే.. ఇరాన్‌కు ఆ గతి పట్టాల్సిందే : డొనాల్డ్ ట్రంప్..
Also Read : Video: ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులతో ఇరాన్‌కు చావుదెబ్బ.. ఆర్మీ కీలక నేతలు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.