ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 'అన్‌లిమిటెడ్' గుడ్ న్యూస్

ఎయిర్‌టెల్(Airtel offers), వొడాఫోన్ ఐడియా (Vodafone idea offers) సంస్థలు తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ వినిపించాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు టారిఫ్ ధరలు పెంచడంతో పాటు ఇతర నెట్‌వర్క్ నెంబర్లకు చేసే అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited voice calls)పై పరిమితి విధించి వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Last Updated : Dec 8, 2019, 02:22 AM IST
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 'అన్‌లిమిటెడ్' గుడ్ న్యూస్

ఎయిర్‌టెల్(Airtel offers), వొడాఫోన్ ఐడియా (Vodafone idea offers) సంస్థలు తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ వినిపించాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు టారిఫ్ ధరలు పెంచడంతో పాటు ఇతర నెట్‌వర్క్ నెంబర్లకు చేసే అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited voice calls)పై పరిమితి విధించి వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఇతర నెట్‌వర్క్ నెంబర్లకు చేసే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌పై ఇదివరకు విధించిన పరిమితిని ఎత్తేస్తున్నట్లు శుక్రవారం ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్ టెల్ కంపెనీ ఓ ట్వీట్ చేసింది. మేము మీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని.. రేపటి నుంచే ఇతర నెట్‌వర్క్స్‌కు కూడా అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ తమ ట్వీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఈ నిర్ణయంపై ఎలాంటి షరతలు లేవని స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్ చేసిన ఈ ప్రకటనపై వినియోగదారుల నుంచి పాజిటివ్ రియాక్షన్ కనిపించింది.

 

ఇదిలావుండగా ఎయిర్ టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కంపెనీ సైతం అన్‌లిమిటెడ్ కాల్స్‌పై ఉన్న పరిమితిని ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై ఏ అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్నా.. ఏ నెట్‌వర్క్ నెంబర్లకైనా.. అపరిమితమైన వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు చేసిన రెండు వేర్వేరు ప్రకటనలు ఈ రెండు సంస్థల వినియోగదారులకు భారీ ఊరటనిచ్చాయి.

 

Trending News