All Party Meeting : మంగళవారం జమ్ము కశ్మీర్ లో అమాయిక పౌరులను పాక్ చెందిన ఉగ్రవాదులు హిందువులే టార్గెట్ గా చేసి కాల్చి చంపారు. ఉగ్రవాదానికి మతం లేదంటూ చెప్పే కుహానా లౌకిక వాదులు ఈ విషయంలో ఏం చెబుతారో చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే.. మన దేశాన్ని టార్గెట్ చేసి ముష్కర మూకల అంతు తేల్చే వరకు నిద్రపోయేది లేదని నరేంద్ర మోడీ సర్కారు.. పాకిస్థాన్ తో ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల దౌత్య సంబంధాలను తెగ తెంపులు చేసుకుంది. ఇక పంజాబ్ లోని భారత్, పాకిస్థాన్ అట్టారీ - వాఘా సరిహద్దు చెక పోస్ట్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు భారత్ వీసా పొందిన పాకిస్థాన్ టూరిస్టులు మరో 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని అల్టీమేటం జారీ చేసింది.
అంతేకాదు నెహ్రూ హయాంలో అప్పటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ తో చేసుకున్న సింధు నది ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా సింధు జలాల పై ఆధారపడిన పాకిస్థాన్ కు ఇది చావు దెబ్బే అని చెప్పాలి. పాక్ రాయబార కార్యాలయంలో సిబ్బందిని 50 నుంచి 30కి తగ్గిస్తున్నట్టు చెప్పారు.
ఈ నేపథ్యంలో భారత్ మరోసారి పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్ తో పాటు డైరెక్ట్ యుద్ధం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం పాకిస్థాన్ పై తీసుకునే చర్యలను వివరించనున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులున్న ప్రతి ఒక్క పార్టీని ఈ భేటికి ఆహ్వానించింది.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో సీసీఎస్ (క్యాబినేట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేశారు. అటారి చెక్‌పోస్ట్ మూసివేత, పాకిస్తానీయులకు భారత్‌లోకి నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్‌కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు అత్యవసరమైతే జమ్ము లో రాష్ట్రపతి పాలన విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









