Rohini Khadse: ప్లీజ్.. మగాళ్లను మర్డర్ చేసుకుంటాం.. ఒక్కచాన్స్ ..!. ఉమెన్స్‌డే వేళ రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ..

ncp sp leader rohini khadse letter: ఎన్సీపీఎస్పీ నేత రోహిణి ఖడ్సే  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖను రాశారు. ఒక్కచాన్స్ ఇవ్వండి.. ఒక మగాడ్ని చంపేందుకు ప్రతి ఆడవాళ్లకు ఒక అవకాశం ఇవ్వండని కూడా లేఖను రాశారు. దీంతో  ఆమె ప్రస్తుతం సంచలనంగా మారారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 8, 2025, 06:53 PM IST
  • ఉమెన్స్ డే వేళ రాష్ట్రపతికి సంచలన లేఖ రాసిన మహిళ నేత..
  • మగాళ్లకు దిమ్మతిరిగే ట్విస్ట్ అంటున్న నెటిజన్లు..
Rohini Khadse: ప్లీజ్..  మగాళ్లను మర్డర్ చేసుకుంటాం.. ఒక్కచాన్స్ ..!. ఉమెన్స్‌డే వేళ రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ..

ncp sp leader rohini khadse letter to president droupadi murmu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికఠిన చర్యలు తీసుకొచ్చిన మహిళలు,అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. ప్రతిరోజు యువతులపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. బస్టాండ్, మెట్రోలు, విమానం ఇలా ప్రతి చోట కూడా మహిళలు వేధింపులకు గురౌతున్నారు. అంతేకాకుండా.. ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు.

Add Zee News as a Preferred Source

సొంత వాళ్లు అన్న, తండ్రి సైతం.. చాలా చోట్ల వేధించి అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు కొకొల్లలు. చివరకు అన్యాయం జరిగిందని పోలీసుల దగ్గరకు వెళ్తే వారు కూడా వేధింపులకు పాల్పడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ప్రతిరోజు కూడా మహిళలపై వేధింపుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. దీనిపై పోక్సో, నిర్భయ వంటి చట్టాలను తీసుకొచ్చిన కూడా కామాంధులు మాత్రం మారడంలేదు.

తాజాగా.. అంతర్జాతీయ మహిళ దినోత్సవంను అందరం గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. దేశ మంతట మహిళల్ని గౌరవించుకుంటూ ఉమెన్స్ డే ను ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో ఎన్సీపీఎస్పీ నేత రోహిణి ఖడ్సే ఏకంగా రాష్ట్రపతికి ఒక షాకింగ్ లేఖను రాశారు. ఇటీవల చాలా మంది మహిళలు వేధింపులు, అత్యాచారాలకు గురౌతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more: Israeli Tourist Gang raped: ఉమెన్స్‌డే వేళ దారుణం.. ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్.. ఎక్కండంటే..?

అదే క్రమంలో దయచేసి.. తమను వేధింపులకు పాల్పడిన మగాళ్లను హత్య చేసేందుకు ఒక చాన్స్ ఇవ్వాలని కూడా ఆలేఖలో కోరారు. సాధారణంగా హత్య చేస్తే పనిష్మెంట్ ఇస్తుంటారు. కానీ తమను వేధించిన వాళ్లను హత్య చేస్తే.. పనిష్మెంట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా తమకు చాన్స్ ఇవ్వాలని కూడా ఎన్సీపీఎస్పీ నేత రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు రాసిన లేఖలో కోరారు. ప్రస్తుతం ఈ లేఖ అంతర్జాతీయ ఉమెన్స్ డే వేళ దేశంలో సంచలనంగా  మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News