Amarnath Yatra Schedule Released: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రతి ఏడాది ఈ యాత్రను నిర్వహిస్తారు. ఏడాది మొత్తం కాకుండా కొన్ని రోజులు మాత్రమే ఈ యాత్ర నిర్వహిస్తారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని రోజుల మాత్రమే బాబా బర్ఫానీ యాత్ర కొనసాగుతుంది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూలై 3వ తేదీనా ప్రారంభం కానుంది. ఆగష్టు 9 వరకు ఈ యాత్ర నిర్వహిస్తారు. అంటే మొత్తం 38 రోజులపాటు నిర్వహిస్తారు. ఈ యాత్రకు సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. త్వరలో ఈ ప్రక్రియ మొదలవుతుంది. తద్వారా ఏ ఆటంకం లేకుండా భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకోవచ్చు.
ఈ యాత్రకు సంబంధించి జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర బోర్డు సమావేశం అయింది. బోర్డు చైర్మన్,జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన డీజీపీ నలిన్ ప్రభాత్, చీఫ్ సెక్రటరీ ఎల్‌జీ అటల్ ధూలు ఇతర సీనియర్ అధికారులు సమావేశం అయి అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూలై 3 నుంచి ఆగష్టు 9 వరకు దర్శించుకోవచ్చు.
అయితే, అమర్‌నాథ్ యాత్రకు 13 ఏళ్ల కంటే తక్కువ 75 ఏళ్లు పైబడిన వృద్ధులు అనర్హులు. అంతేకాదు అమర్‌నాథ్‌కు వెళ్లే ముందు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒక్క పర్మిట్‌కు ఒక్క భక్తులు మాత్రమే అర్హులు ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉండదు.
అమర్ నాథ్ యాత్ర 40 నుంచి 60 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహిస్తారు. గత సంవత్సరం జూన్ 29 నుంచి ప్రారంభం అయి ఆగష్టు 19 వరకు నిర్వహించారు. కాగా ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గత ఏడాది ఏప్రిల్ 17వ తేదీ నుంచే ప్రారంభం అయింది. ఈ యాత్ర ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యాత్రబోర్డు భక్తులకు భద్రత, ఆహార సౌకర్యాలు కూడా కల్పిస్తుంది.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ సూపర్ హిట్ ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ తెలిస్తే షాకే..
అమర్‌నాథ్ యాత్ర హిందూవులకు ఎంతో పవిత్రమైన యాత్ర. ప్రతి ఏడాది కొన్ని మిలియన్ల కొద్ది యాత్రికులు పర్వతాలు, ఘాట్‌రోడ్లను దాటుకుంటూ ఆ శివయ్యను దర్శించుకుంటారు. ఇక్కడ శివలింగ రూపం సహజసిద్ధంగా ఆవిర్భవించింది. మంచు లింగం ఇక్కడి ప్రత్యేకత. కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఈ ఆలయం ఉంది. ప్రతి ఏడాది జూన్ నుంచి ఆగష్టు మధ్యలో ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను శ్రీ అమర్‌నాథ్ యాత్ర బోర్డు (SASB) ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్, హెలికాప్టర్, మ్యూల్ ,పల్లకీ వంటి సాంప్రదాయ ఏర్పాట్లు చేస్తారు. ఇది భక్తులకు సౌకర్యవంతంగా ఉండే ప్రత్యామ్నాయం.
ఇదీ చదవండి: అలెర్ట్.. నేడు ఈ 84 మండలాల్లో తీవ్ర వడగాలులు హెచ్చరించిన వాతావరణ శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









