close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

అపర భారత కుబేరుల జాబితాలో మళ్లీ అంబానీదే అగ్రస్థానం !!

సంపదను కూటబెట్టడంలో ఈ సారి కూడా  ముఖేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు

Updated: Jul 18, 2019, 05:07 PM IST
అపర భారత కుబేరుల జాబితాలో మళ్లీ అంబానీదే అగ్రస్థానం !!

భారత దేశలో అపర కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ మళ్లీ  అగ్రస్థానాన్ని నిలుపుకున్నారు. తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన బిలియనీర్ ఇండెక్స్ లో  మొత్తం 51.3 బిలియన్‌ డాలర్ల సంపదతో  అంబానీ భారతదేశం కుబేరుల్లో టాప్ ప్లేస్ లో ఉండగా తరువాతి స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌ జీ 20.5 బిలియన్‌ డాలర్లతో  సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్‌ (  14.7 B ), కోటక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కోటక్ ( 14.0 ) మూడు, నాల్గు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

టాప్ 100లో ఆ నలుగురు భారతీయులు

తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన బిలియనీర్ ఇండెక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల జాబితాలో 14వ స్థానంలో అంబానీ ఉన్నారు.  అజీమ్ ప్రేమ్ జీది 48వ ర్యాంకు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్‌ 92వ స్థానంలో, కోటక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కోటక్ 96వ స్థానంలో ఉన్నారని బ్లూంబర్గ్ పేర్కొంది. గతంలో కంటే స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ లో 10లో ముఖ్యంగా బిల్ గేట్స్ రెండో స్థానం నుంచి మూడో స్థానికి పడిపోయారు.

1. ముఖేష్ అంబానీ        :  51.3 బిలియన్ డాలర్లు
2. అజీమ్ ప్రేమ్‌జీ           : 20.5 బిలియన్ డాలర్లు
3.శివ నాదర్                   : 14.7 బిలియన్ డాలర్లు
4.ఉదయ్ కోటక్              : 14.0 బిలియన్ డాలర్లు
5.లక్ష్మి మిట్టల్               : 12.4 బిలియన్ డాలర్లు
6. గౌతమ్ అదానీ            : 9.94 బిలియన్ డాలర్లు
7. రాధాకిషన్ దమాని     : 8.18 బిలియన్ డాలర్లు
8.సైరస్ పూనవల్లా         : 7.69 బిలియన్ డాలర్లు
9. దిలీప్ షాంఘ్వీ          : 7.68 బిలియన్ డాలర్లు
10 కుమార్ బిర్లా             : 7.20 బిలియన్ డాలర్లు