Half Day Schools: ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తీవ్రమైన ఉక్కపోత ఉంటోంది. మరోవైపు వడగాల్పులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి హాప్ డే స్కూల్స్ ప్రకటన జారీ అయింది. మార్చ్ 5 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.
వేసవి ప్రతాపం అధికంగా ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఏడాది వేసవి చాలా తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా మార్చ్ మూడో వారం నుంచి ఏప్రిల్, మే వరకూ ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇక వడగాలులు ఈ నెల మూడో వారం నుంచి ప్రతాపం చూపించనున్నాయి. ఇప్పుడు కూడా మద్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణల్లో మార్చ్ 15 నుంచే ఒంటి పూట బడులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఒక పూటే పనిచేయాల్సి ఉంటుంది. ఒంటి పూట బడుల ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్నింటికీ వర్తిస్తాయి. ఒంటి పూట బడుల కారణంగా స్కూల్స్ టైమింగ్స్ మారనున్నాయి.
ఒంటి పూట బడుల టైమింగ్స్, ఎప్పటి వరకు, వేసవి సెలవులు ఎప్పుడు
మార్చ్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మద్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. ఇలా మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 23 వరకూ నడుస్తాయి. ఆ తరువాత వేసవి సెలవులు ప్రకటిస్తారు. ఈసారి వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకూ షెడ్యూల్ అయ్యాయి. జూన్ 12 నుంచి కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కానుంది.
మరో వైపు ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు మాత్రం వేసవి సెలవులు తగ్గనున్నాయి. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు మొత్తం 39 రోజుల వేసవి సెలవులుంటాయి. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు మార్చ్ 19న, రెండో ఏడాది పరీక్షలు మార్చ్ 20 ముగుస్తాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 23 వరకూ వచ్చే విద్య సంవత్సరానికి సంబంధించిన తరగతులు ప్రారంభమౌతాయి.
Also read: PM Internship 2025: విద్యార్ధులు నెలకు 5 వేలు పొందే అవకాశం, ఇవాళ ఆఖరు తేదీ, ఎలా అప్లై చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









