Rainfall: ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భగభగమండే ఎండల్నించి ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులు పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా భయపెట్టింది. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.
సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి కూడా విస్తరించి ఉండటంతో నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో నిన్న భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోయర్ ట్యాంక్ బండ్, చార్మినార్, ఉప్పల్, సరూర్ నగర్, బండ్లగూడ, బాలానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. హిమాయత్ నగర్‌లో అత్యధికంగా 9.1 సెంటీమీటర్, చార్మినార్‌లో 9, సరూర్ నగర్‌లో 8.9, నాంపల్లిలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలానగర్‌లో 7.7, షేక్ పేటలో 8, అంబర్ పేట్‌లో 7.4, మారేడ్ పల్లిలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇక ఏపీలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లాలో 6.5 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లాలో 5.7 సెంటీమీటర్లు, నంద్యాలలో 4.3 సెంటీమీటర్ల వర్షపాత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యల్పంగా 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం జరిగాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇవాళ, రేపు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పిడుగులు కూడా పడే ప్రమాదమున్నందున ఆరుబయట తిరగవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో నిన్నటి పిడుగుపాటు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి.
Also read: AP Bars e Auction: మందుబాబులకు గుడ్‌న్యూస్, 44 బార్లకు ఈ వేలం, ఏ జిల్లాలో ఎంత ఫీజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









