AP TG Inter Results 2025: ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చ్ 1 నుంచి మార్చ్ 20 వరకు జరిగాయి. తెలంగాణలో మార్చ్ 5 నుంచి మార్చ్ 24 వరకూ జరిగాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం జరుగుతోంది. ఏపీలో ఇంటర్ ఫలితాలు మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 12-15 మధ్యలో విడుదల కానున్నాయి. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిపోయింది. ప్రస్తుతం మార్కుల కంప్యూటరీకరణ జరుగుతోంది. ఆ తరువాత అధికారికంగా ఫలితాల వెల్లడి కానున్నాయి. ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఫలితాలను ఆన్‌లైన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఇక ఇది కాకుండా ఏపీ ప్రభుత్వం అధికారిక వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మార్కుల మెమో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇక తెలంగాణలో ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ఇంకా జరుగుతోంది. ఏప్రిల్ మూడో వారం వరకూ ఈ ప్రక్రియ కొనసాగవచ్చు. ఆ తరువాత ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఉంటే చాలు. తెలంగాణలో మొత్తం 9,96,971 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
Also read: Public Holidays: గుడ్‌న్యూస్, స్కూల్స్ ఆఫీసులకు వరుసగా 5 రోజులు సెలవులు, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









