MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరే

MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. పోటీ లేకపోవడంతో రెండు రాష్ట్రాల్లోనూ 10 మంది ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2025, 09:31 PM IST
MLC Elections 2025: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరే

MLC Elections 2025: ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ్టితో రెండు రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. వివిధ పార్టీల అభ్యర్ధుల తప్ప మరెవరూ పోటీ లేకపోవడంతో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

Add Zee News as a Preferred Source

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు తగినంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేయలేదు. మొత్తం ఐదు స్థానాల్ని కూటమిలోని మూడు పార్టీలు పంచుకున్నాయి. జనసేన, బీజేపీలకు చెరొక ఎమ్మెల్సీ స్థానం కేటాయించగా, తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో అభ్యర్ధుల్ని బరిలో దించింది. ఈ ఐదుగురిలో  కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు, బీద రవీంద్ర, తిరుమల నాయడు, గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు ఉన్నారు. ఏపీ నుంచి కొత్తగా ఎన్నికైన వారికి ఎన్నికల సంఘం అధికారులు ధృవపత్రాల్ని అందించారు. 

1. బీద రవీంద్ర - తెలుగుదేశం 
2. తిరుమల నాయుడు - తెలుగుదేశం
3. గ్రీష్మ ప్రసాద్ - తెలుగుదేశం
4. కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు - జనసేన
5. సోము వీర్రాజు - బీజేపీ

అటు తెలంగాణలో కూడా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీకు సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేయలేదు. బీఆర్ఎస్ తనకున్న సంఖ్యాబలం ఆధారంగా ఒక స్థానంలో అభ్యర్ధిని బరిలో దించింది. ఇక కాంగ్రెస్ మూడు స్థానాల్లో అభ్యర్ధుల్ని బరిలో దింపగా మరో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకు కేటాయించింది. తెలంగాణలో కూడా మరే అభ్యర్ధి నామినేషన్ దాఖలు కాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి ఎన్నికల సంఘం అధికారులు ధృవపత్రాల్ని అందించారు. 

1. అద్దంకి దయాకర్ - కాంగ్రెస్
2. విజయశాంతి - కాంగ్రెస్
3. శంకర్ నాయక్ - కాంగ్రెస్
4. దాసోజు శ్రవణ్ కుమార్ - బీఆర్ఎస్
5. నెల్లికంటి సత్యం - సీపీఐ

తెలంగాణలో కాంగ్రెస్ తరపున విజయశాంతి అభ్యర్థిత్వం అనూహ్యంగా ఖరారైంది. ఎవరూ ఊహించలేదు. పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం ఇది. ఇక ఏపీలో బీజేపీ తరపున ఎన్నికైన సోము వీర్రాజు అభ్యర్థిత్వం కూడా చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఆగమేఘాలపై ప్రత్యేక విమానాల ఏర్పాట్లతో నామినేషన్ ప్రక్రియ జరిపించారు. 

Also read: Lowest DA Hike: ఉద్యోగులకు భారీ షాక్, ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ డీఏ పెంపు కేవలం 2 శాతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News