Public Holidays: గుడ్‌న్యూస్, స్కూల్స్ ఆఫీసులకు వరుసగా 5 రోజులు సెలవులు, ఎప్పుడంటే

Public Holidays: ఉద్యోగులు, విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణలో వరుస సెలవులు ఉన్నాయి. ఒక్క రోజు సెలవు పెడితే చాలు వరుసగా ఐదు రోజులు సెలవులు ఎంజాయ్ చేయవచ్చు. సమ్మర్ వెకేషన్ వెళ్లి రావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2025, 12:29 PM IST
Public Holidays: గుడ్‌న్యూస్, స్కూల్స్ ఆఫీసులకు వరుసగా 5 రోజులు సెలవులు, ఎప్పుడంటే

Public Holidays: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్ధులు, ఉద్యోగులకు హ్యాపీ న్యూస్. వేసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి వచ్చేందుకు అద్భుతమైన అవకాశం. ఎందుకంటే వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. మధ్యలో ఓ రోజు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. కుటుంబంతో సహా ఎంజాయ్ చేసి రావచ్చు. 

Add Zee News as a Preferred Source

సెలవులంటే చాలు విద్యార్ధులు ఎగిరి గంతేస్తారు. ఏప్రిల్ నెలలో సమ్మర్ హాలిడేస్ ఎలానూ ఉంటాయి. కానీ అంతకంటే ముందే వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. కేవలం విద్యార్ధులకే కాదు ఉద్యోగులకు కూడా సెలవులు ఉండటంతో కుటుంబంతో సహా సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏపీలో ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సెలవు ఉంటే ఏప్రిల్ 12న రెండవ శనివారం, ఏప్రిల్ 13న ఆదివారం, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సెలవు ఉంది. మధ్యలో ఏప్రిల్ 11న సెలవు పెడితే చాలు ఏకంగా ఐదు రోజులు ఎంజాయ్ చేయవచ్చు. ఆ తరువాత ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే సెలవు ఉంది. ఏప్రిల్ 30న బసవ జయంతి ఆప్షనల్ హాలిడే ఉంది. ఏప్రిల్ 24 నుంచి ఏపీలో వేసవి సెలవులు ఉన్నాయి. 

తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఏప్రిల్ 10వ తేదీన మహావీర్ జయంతి సెలవు కాగా ఏప్రిల్ 12న రెండవ శనివారం, ఏప్రిల్ 13న ఆదివారం సెలవులున్నాయి. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సెలవు ఉంది. తెలంగాణలో కూడా ఏప్రిల్ 11 మేనేజ్ చేసుకుంటే వరుసగా ఐదు రోజులు సెలవులుంటాయి. 

Also read: TTD WhatsApp Services: ఇకపై తిరుమల శ్రీవారి సేవలు కూడా వాట్సప్ ద్వారా, ఏయే సేవలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News