School Holidays: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్కూల్ పిల్లలకు శుభవార్త. ఈ నెలలో అన్నీ సెలవులే ఉన్నాయి. విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వేసవి సెలవులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఎప్పుడెప్పుడు సెలవులున్నాయి. సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచనే వివరాలు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలిడేస్‌పై స్పష్టత వచ్చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ అటు ఇంటర్మీడియట్, ఇటు పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇక మిగిలింది 1 నుంచి 9వ తరగతి పరీక్షలు మాత్రమే. ఇవి కూడా పూర్తయితే సమ్మర్ హాలిడేస్ ప్రారంభమౌతాయి. అయితే అంతకంటే ముందే ఇతర సెలవులున్నాయి. ఏప్రిల్ నెలలో స్కూల్స్ మొత్తం 16 రోజులే పనిచేస్తుంది. మిగిలినవన్నీ సెలవులే కావడం విశేషం.
ఏప్రిల్ 1 రంజాన్ సెలవు కాగా ఏప్రిల్ 5వ తేదీ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సెలవు ఉంది. కేవలం స్కూళ్లకే కాకుండా ప్రభుత్వ ఆఫీసులకు సైతం సెలవు ఉంది. ఇక ఏప్రిల్ 6 ఆదివారంతో పాటు ఆ రోజు శ్రీ రామనవమి ఉంది. ఏప్రిల్ 13 ఆదివారం కాగా ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సెలవు ఉంది. ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే పబ్లిక్ హాలిడే ఉంది. ఈ రోజున స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉంది. ఏప్రిల్ 20 ఆదివారం సెలవు ఉంది.
ఇక ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ 1వ తరగతి నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ 2 పరీక్షలు ఉన్నాయి. ఇవి ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 19 వరకు జరనున్నాయి. ఆ తరువాత ఏప్రిల్ 23 చివరి పనిదినం. ఆ రోజు ప్రాగ్రెస్ రిపోర్టులు చేతికి ఇస్తారు. ఏప్రిల్ 24 నుంచి తిరిగి జూన్ 11 వరకూ సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. తిరిగి జూన్ 12వ తేదీన స్కూల్స్ తెర్చుకోనున్నాయి.
Also read: 8th Pay Commission: వేతన సంఘంలో పింఛన్‌దారులకు భారీ కోత.. పింఛన్ సవరణకు బ్రేక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









