Rain Alert: వేసవి పీక్స్ కు చేరుతోంది. ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అడపా దడపా వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడి నైరుతి దిశగా పయనిస్తోంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. పిడుగులు కూడా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆరుబయట లేదా పొలాల్లో లేదా చెట్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు.
ఇక తెలంగాణలో కూడా వచ్చే రెండు రోజులు వర్షాలు పడనున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అదనంగా నమోదు కావచ్చు. మహబూబాబాద్, సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ , నారాయణ పేట్, జోగులాంబ జిల్లాల్లా వర్షాలు పడనున్నాయి.
ఇక పగటి ఉష్ణోగ్రతలు ఏపీలో క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ముప్పు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయి. 67 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. నిన్న పల్నాడు జిల్లా రావిపాడులో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Also read: AP 10th Results 2025: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ ఫిక్స్, ఎప్పుుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









