Heavy Rains Alert: తెలంగాణలో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ్టి నుంచి వచ్చే 5 రోజులు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని ఏయే జిల్లాల్లో భారీ వర్షాలు పొంచి ఉన్నాయో తెలుసుకుందాం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నా మరోవైపు వర్షాలు మాత్రం వీడటం లేదు. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 5 రోజులు వర్షాలు తప్పేట్టు లేవు. నిన్న హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. బండ్లగూడలో అత్యధికంగా 8 సెంటీమీటర్లు, చార్మినార్ ప్రాంతంలో 7.6 సెంటీమీటర్లు, బహదూర్ పూర్‌లో 7.8 సెంటీమీటర్లు, నాంపల్లిలో 6.9, అంబర్ పేట్‌లో 5, కుత్బుల్లాపూర్‌లో 4.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 3.5 సెంటీమీటర్లు, సికింద్రాబాద్‌లో 3.4 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నౌమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా 2-3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు బలంగా వీచాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొమ్మలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
వాతావరణంలో మార్పుల కారణంగా రానున్న 5 రోజుల్లో తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మరో వైపు మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సైతం మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ 16 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఈదురు గాలులు కూడా గట్టిగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండవచ్చు.
ఓ వైపు ఈ 16 జిల్లాల్లో వర్షాల హెచ్చరిక ఉన్నా మరో వైపు పగటి ఉష్ణోగ్రత కూడా పెరగనుంది. ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరగవచ్చు. ఏపీలో కూడా కాకినాడ, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
Also read: AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









