Heavy Rainfall Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ రేపు కుమ్మేయనున్న వర్షాలు

Heavy Rainfall Alert: మండు వేసవిలో ఓ వైపు ఎండలు భగభగమండుతుంటే మరోవైపు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్ష సూచన ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2025, 08:40 AM IST
Heavy Rainfall Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ రేపు కుమ్మేయనున్న వర్షాలు

Heavy Rainfall Alert: ఏపీ, తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేలా వర్షసూచన జారీ అయింది. రానున్న 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. 

Add Zee News as a Preferred Source

ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు వాతావరణంలో తీవ్ర మార్పులుంటాయి. ఆకాశం మేఘావృతమై కన్పిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. వర్షాలు, ఉరుములు, మెరుపులతో  ఈదురుగాలులు వీయనున్నాయి. ఒడిశా నుంచి కొమారిన్ వరకు విస్తరించి ఉపరితల ద్రోణితో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను ఆవర్తనం ప్రభావంతో వాతావరణంలో మార్పులు రానున్నాయి. నైరుతి ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల్లో తేమ ఉంటోంది. ఫలితంగా వర్షాలు పడనున్నాయి. అందుకే రానున్న 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 6 వరకూ హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. అదే ఇవాళ, రేపు వర్షాలు తీవ్రంగా ఉండనున్నాయి. 

ఇవాళ, రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆదిలాబాద్, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడనున్నాయి. 

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా రానున్న మూడు రోజులు విస్తృతంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 6వ తేదీ వరకూ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవాళ్టి నుంచి భారీ వర్ష సూచన ఉంది. రాయలసీమ ప్రాంతంలో వడగండ్లు పడే అవకాశాలున్నాయి. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇవాళ, రేపు పిడుగులు పడే ప్రమాదమున్నందున ఆరుబయట తిరగవద్దని సూచిస్తున్నారు. 

హైదరాబాద్‌లో ఇవాళ వర్షాలు పడనున్నాయి. సాయంత్రానికి వర్షం తీవ్రత పెరగవచ్చు. వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదముంది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్లతో గాలివేగం ఉంటుంది. ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. 

Also read: Exam Results Date: ఏపీ తెలంగాణ ఇంటర్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News