Summer Impact: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికమైంది. గత నాలుగైదు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఓ వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ముఖ్యంగా మే నెలలో ఎండలు పీక్స్‌కు చేరుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. వర్షాలు నిలిచిపోవడంతో వాతావరణంలో మార్పు వచ్చింది. ఉదయం 10 గంటలకే వాతావరణం వేడెక్కుతోంది. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు 42-43 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి ఓ వైపు ఉష్ణోగ్రత మరోవైపు తీవ్రమైన ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. వచ్చే మే నెలలో ఎండలు మరింతగా పెరిగి 45-46 డిగ్రీల వరకూ చేరుతుందని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 49 డిగ్రీలు దాటే ప్రమాదం లేకపోలేదు. వడగాలులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఎండలు, ఉక్కపోత కారణంగా డీ హైడ్రేషన్ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే చిన్నారులు, వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో రానున్న రోజుల్లో 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. నంద్యాల జిల్లా గోనవరంలో అత్యధికంగా నిన్న 44 డిగ్రీలు నమోదైంది. ఇక వైఎస్సార్ కడప, ప్రకాశం, నంద్యాల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఎందుకంటే ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత రానున్న రోజుల్లో 45 డిగ్రీలు ఉండవచ్చు. రాత్రి కూడా వేడి గాలులు వీయనున్నాయి.
Also read: NEET UG 2025 City Intimation: నీట్ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









