Rain Alert: ఏపీ, హైదరాబాద్‌లో ఇవాళ ఉరుములు మెరుపులు భారీ వర్షం

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు వేర్వేరు ప్రాంతాల్లో ఆవహించిన ద్రోణి ప్రభావంతో వాతావరణం ఆందోళనకరంగా మారింది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన జారీ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2025, 10:14 AM IST
Rain Alert: ఏపీ, హైదరాబాద్‌లో ఇవాళ ఉరుములు మెరుపులు భారీ వర్షం

Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణం భిన్నంగా కన్పిస్తోంది. రోజూరోజూ మారుతోంది. ఓ వైపు గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకోవైపు ఇవాళ, రేపు ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. 

Add Zee News as a Preferred Source

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. మరోవైపు దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ ఆవహించిన ద్రోణి, కర్ణాటక వరకూ ఉన్న మరో ద్రోణి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో  గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈదురుగాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. అందుకే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. 

ఇక హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఉష్షోగ్రత 30-34 డిగ్రీల మధ్యలో ఉండవచ్చు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయి. తూర్పు తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతంలో ఇవాళ తేలికపాటి వర్షం పడవచ్చు. సాయంత్రానికి రాయలసీమ, మధ్య తెలంగాణ ప్రాంతంలో వర్షం ఉంటుంది. ఇక హైదారాబాద్‌లో అయితే ఇవాళ సాయంత్రం 5 గంటల తరువాత మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. 

ఏపీలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రత 34-39 డిగ్రీల మధ్యలో ఉండవచ్చని అంచనా. ఓ వైపు తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడినా వాతావరణం మాత్రం వేడిగానే ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం 55 శాతం తేమ ఉంటే తెలంగాణలో 40 శాతం ఉంది. 

Also read: Public Holiday: ఏప్రిల్ 18 బ్యాంకులు, స్కూల్స్, ఆఫీసులకు సెలవు ఎందుకంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News