
AP TG Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా సంభవించిన అకాల వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఇప్పుడు మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదు కానుంది.
ఏపీ, తెలంగాణల్లో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రేపు మార్చ్ 25న పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2-3 రోజుల్లో ఏపీలోని 52 మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉండనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6, కాకినాడలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 6, ఏలూరులో 2, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉండనున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున మరోసారి అకాల వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం పడవచ్చు. ఆరుబయట, చెట్లు, టవర్ల కింద్, పొలాల్లో తిరగవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక తెలంగాణలో రేపటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారనుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు లేదా తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉండవచ్చు.
ఎండల తీవ్రత, వడగాలులు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా, అనారోగ్యం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. తీవ్రమైన వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి