AP Ration Card e KYC: ఏపీలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నుంచి ముఖ్యమైన అప్‌డేట్ ఇది. మీ రేషన్ కార్డుల్ని తక్షణం అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీ రేషన్ కార్డుల ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోకా ఈ కేవైసీ చేయించకపోతే రేషన్ ఆగిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రేషన్ బియ్యం పంపిణీలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనర్హుల్ని రేషన్ జాబితా నుంచి తొలగించేందుకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ పూర్తి చేయడం చాలా సులభం. మీ సమీపంలోని రేషన్ షాప్ లేదా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్‌కు వెళ్లాలి. అక్కడ ఉండే ePoS పరికరంలో మీ వేలి ముద్ర వేస్తే చాలు ఈ కేవైసీ పూర్తయిపోతుంది. రేషన్ షాపు కాని పక్షంలో గ్రామ, వార్డు సచివాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
మీ రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తయిందో లేదో ఆన్‌లైన్‌లో కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికోసం ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ https://epds2.ap.gov.in/epdsAP/epds ఓపెన్ చేయాలి. తరువాత డ్యాష్ బోర్డ్ క్లిక్ చేస్తే రేషన్ కార్డు సెక్షన్‌లో EPDS Application Search లేదా Rice Card Search ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..స్క్కీన్‌పై కుటుంబసభ్యుల వివరాలు కన్పిస్తాయి. మీ పేరు ఎదురుగా సక్సెస్ లేదా ఎస్ అని కన్పిస్తే ఇ కేవైసీ పూర్తయినట్టు. లేదా పెండింగులో ఉందని అర్ధం. ఐదేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ల దాటిన వృద్ధులకు ఇ కేవైసీ అవసరం లేదు. ఈ నెలాఖరు అంటే ఏప్రిల్ 30 వరకూ ఇ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే మే నెల రేషన్ అందదు.
Also read: Supreme Court on Wakf: వక్ఫ్ భూముల డీ నోటిఫై వద్దు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









